Hyderabad : రాత్రి 8 లోపు నగరంలో భారీ వర్షం!

తెలంగాణకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు.

New Update
Hyderabad : రాత్రి 8 లోపు నగరంలో భారీ వర్షం!

Telangana : తెలంగాణకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ(Meteorological Department Of Hyderabad) భారీ వర్ష(Heavy Rain) సూచన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న వెల్లడించారు. రాష్ట్రంలోని ఈశాన్య మరియు తూర్పు జిల్లాలు, చుట్టుపక్కల కొన్ని జిల్లాల్లో ఈ ప్రభావం ఉంటుందని తెలిపారు. తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ప్రస్తుతం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే నాలుగైదు రోజుల్లో కొనసాగే అవకాశం ఉందని.. రానున్న నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌లో నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే గురువారం హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. మరోసారి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన(Heavy Rain Alert) చేసింది. నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

Also read: అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు?

Advertisment
తాజా కథనాలు