Rain Alert For AP & TS: రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ విభాగం తెలిపింది. ఆదివారం తమిళనాడు, పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం సోమవారం దక్షిణ కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తుకు విస్తరించింది. ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంగి, మరో ద్రోణి దక్షిణ కోస్తా, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం కర్ణాటక వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల కొనసాగుతున్నదని వాతావరణశాఖ (IMD) వివరించింది.
అది ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా, 24 వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.రాష్ట్రంలో మంగళవారం వరంగల్, హనుమకొండ, జనగామ, సంగారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, మెదక్ జిల్లాల్లో వానలు పడతాయని తెలిపారు.
బుధవారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, జోగులాంబ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, తదితర జిల్లాల్లో వానలు కురవచ్చని వివరించారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు.
Also Read: చైనా వార్ ప్లాన్.. ఎదురుదాడికి రెడీ అవుతున్న తైవాన్