మార్క్ జుకర్ బర్గ్ ముఖపుస్తకం, ఇన్స్టాగ్రామ్ ల పద్దతిని మార్చేస్తున్నాడు. అతను కూడా ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్ మార్గాన్నే అనుసరిస్తున్నాడు. మెటా నుంచి యాడ్స్ ఫ్రీ సబ్ ప్క్రిప్షన్ ప్లాన్ ను ప్రవేశపెట్టడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లు ిక మీదట వాడాలంటే తప్పకుండా డబ్బులు చెల్లించాల్సిందే. అయితే ఇక్కడ ఒక మెలిక ఉంది. ఈ డబ్బులు చెల్లింపు అందరికీ కాదు. ఎవరైతే యాడ్స్ లేకుండా ఆ రెండు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను వాడాలని అనుకుంటారో వాళ్ళు మాత్రమే డబ్బులు చెల్లించాలి. యాడ్స్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు.
యాడ్స్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ను భారత్ మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం ప్రవేశపెట్టాలని అనుకుంటోంది మెటా యాజమాన్యం. అయితే ప్రస్తుతానికి ట్రయల్స్ లోనే ఉంది. వీటి తర్వాత అఫీషియల్ గా 2024 మధ్యలో కానీ చివరికి గానీ అమలులోకి రానుందని సమాచారం. ఈ పద్ధతి అమలులోకి వస్తే యాడ్స్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ కోసం ఇన్స్టాగ్రామ్ అయితే 14 డాలర్లు , ఫేస్ బుక్ అయితే 17 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే దీని మీద అధికారికంగా ఇంకా ఏ ప్రకటనా రాలేదు.
వినియోగదారుల అనుమతి లేకుండా యాడ్స్ పంపిసందుకు ఐర్లాండ్ ప్రైవసీ కమీషన్ మెటాకు భారీ జరీమానా విధించింది. అందుకే ఇప్పుడు మెటా ఈ యాడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ను తీసుకువస్తోందని సమాచారం.
ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నాక ఎలన్ మస్క్ రెవెన్యూ పెంచుకునే మార్గాలు ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే..బ్లూ టిక్ కోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని ప్రకటించారు. అందుకు కొంత ధర కూడా నిర్ణయించారు. అంటే...ఇకపై ట్విటర్ యూజర్స్ ఎవరైనా బ్లూ టిక్ కావాలంటే కచ్చితంగా డబ్బు చెల్లించాల్సిందే. ఇప్పటికే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ట్విటర్.. ఇండియాలోనూ దీన్ని లాంఛ్ చేసింది. ఇండియా యూజర్స్ ట్విటర్ బ్లూ ఫీచర్‌ను వినియోగించుకోవాలనుకుంటే నెలకు రూ.650 చెల్లించాలి. ఇది వెబ్ యూజర్స్‌కి. అదే మొబైల్ యూజర్స్ అయితే..రూ.900 కట్టాలి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్‌లో ఈ సర్వీస్ మొదలైంది. అక్కడి వెబ్ యూజర్స్ నెలకు 8 డాలర్లు చెల్లిస్తేనే బ్లూ టిక్ ఉంటుంది. అదే ఏడాదికైతే 84 డాలర్లు చెల్లించాలి. అదే యాండ్రాయిడ్ యూజర్స్ అయితే ట్విటర్ బ్లూ టిక్ కోసం అదనంగా 3 డాలర్లు చెల్లించాలి. అయితే...ఇందులో నుంచి కొంత వాటా గూగుల్‌కు కమీషన్ కింద ఇచ్చేస్తుంది ట్విటర్. ఇండియాలో ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్ కోసం రూ. 6,800 కట్టాలని కంపెనీ వెల్లడించింది.
Also Read:హమాస్ అరాచకం..మహిళను చంపి, ట్రక్కు మీద నగ్నంగా ఊరేగించి..