Goshamahal: భవిష్యత్ తరాలకు ఓ స్ఫూర్తి.. మహానీయుల త్యాగల్ని స్మరించుకునేలా: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో మేరీ మాటీ.. మేరా దేశ్’ కార్యక్రమంలో భాగంగా గోషామహల్ నియోజకవర్గంలో ఇంటింటింట తిరిగి మట్టి సేకరించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్‌తో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గోషామహల్ ట్రాఫిక్ (ACP) కార్యాలయం సమీపంలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. మొక్కలు నాటారు. By Vijaya Nimma 04 Sep 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Meri Maati Mera Desh: దేశంకోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానీయులను గుర్తు చేస్తూ వారి నుంచి స్ఫూర్తి పొందుతూ స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అక్కడినుంచి.. ఇంటింటికీ తిరుగుతూ మట్టిని సేకరిస్తూ గోషామహల్‌లోని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు వందేమాతరం రామచందర్ రావు నివాసం వరకు ఈ మట్టి సేకరణ కార్యక్రమం కొనసాగింది. రామచందర్ రావు నివాసం దగ్గర వారి కుటుంబ సభ్యుల్ని సన్మానించారు. రామచందర్‌రావు త్యాగాన్ని, వారి స్ఫూర్తిని, పోరాటాన్ని,సేవల్ని కిషన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. Your browser does not support the video tag. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా.. మనం గతేడాది, ఈ ఏడాది ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని మీ అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించుకున్నామన్నారు. కులామతాలతో సంబంధం లేకుండా దేశ సమగ్రతను చాటుతూ యావత్ దేశం జరుపుకుందన్నారు. దీంట్లో భాగంగానే.. ఈసారి ‘మేరీ మాటీ మేరా దేశ్’ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అన్నారు. మనం పుట్టిన నేల.. మనల్ని కన్న దేశం పట్ల గౌరవభావాన్ని చాటుకోవడంతోపాటుగా.. ఈ మట్టి మీద పుట్టి నాడు దేశ స్వాతంత్ర్యం కోసం, తర్వాత రజాకార్లతో పోరాటంలో, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ సరిహద్దులు కాపాడంటలో అమరులైన సైనికులు వారి కుటుంబాలను, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగాలు చేశారు. వివిధ సాయుధ బలగాలకు చెందిన వారి కుటుంబాలను గుర్తుచేసుకుని వారి త్యాగాలను స్మరించుకుని మన మట్టి గొప్పదనాన్ని చాటుకోవడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. భవిష్యత్ తరాలకు చాటి చెప్పేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాం. Also Read: తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ Your browser does not support the video tag. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూతో ఐదు ప్రతిజ్ఞలు చేశారు. ఆ ఐదు ప్రతిజ్ఞలు..1. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో నావంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తాను. 2. వలసవాద ఆలోచనలనుంచి విముక్తి 3. ఘనమైన భారతదేశ సంస్కృతి, వారసత్వాలను ప్రోత్సహిస్తాను, ప్రచారం చేస్తాను. 4. దేశ ఐకమత్యం, సార్వభౌమత్వం కోసం నిరంతర కృషి చేస్తాను. 5. దేశ రక్షణకోసం, దేశాభివృద్ధికోసం త్యాగాలు చేసిన వారందరినీ గుర్తుచేసుకుని, గౌరవించడం బాధ్యతగా స్వీకరిస్తానని ప్రతిజ్ఞ చేయాలి. ఈ శిలాఫలకాల వద్ద సెల్ఫీలు తీసుకుని..మేరీ మాటీ మేరాదేశ్ వెబ్‌సైట్‌లో పోస్టు చేయాలన్నారు. మన పెద్దల ధైర్య సాహసాలను, శౌర్య ప్రతాపాలను, త్యాగాన్ని, మన దేశపు పవిత్రమైన మట్టి గొప్పదనాన్ని స్మరించుకుంటూ ఈ ‘మేరీ మాటీ మేరా దేశ్’ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ మట్టిని సేకరించి ఢిల్లీ వేదికగా 75 వేల మొక్కలు నాటి మహానీయుల త్యాగల్ని స్మరించుకునేలా వారి నుంచి స్ఫూర్తి పొందెందుకు అమృత వనం ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఇది భవిష్యత్ తరాలకు స్పూర్తి నిస్తుందని ప్రధాని ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు. Your browser does not support the video tag. Also Read: గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణనే..ఎన్నికల సంఘం ప్రకటన! #hyderabad #meri-maati-mera-desh #union-minister-kishan-reddy #goshamahal #meri-mati-mera-desh-programme మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి