Independence Day 2023 : నేటి నుంచి " మేరీ మాటి మేరా దేశ్" కార్యక్రమం ప్రారంభం...!!
జూలై 30న 'మన్ కీ బాత్' 103వ ఎడిషన్ సందర్భంగా 'మేరీ మాటి మేరా దేశ్' ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. ఈ క్యాంపెయిన్లో దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించి అమరవీరులను స్మరించుకోనున్నారు. ఆగస్టు 9న ప్రచారాన్ని ప్రారంభించి, ఆగస్టు 30న ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతినెలా చివరి ఆదివారం మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఆల్ ఇండియాలో రేడియోలో దేశ ప్రజలతో ముచ్చటించే సంగతి తెలిసిందే.