Melinda French Gates: ఈ ఎన్నికల్లో నా ఓటు ఆయనకే: మిలిందా గెేట్స్ ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి తన ఓటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కే అని బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా గెేట్స్ స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వంలో మహిళల ఆరోగ్యం, స్వేచ్ఛ, భద్రత ప్రమాదంలో పడిందని విమర్శించారు. By B Aravind 21 Jun 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Melinda French Gates: ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో లాగే ఈసారి కూడా డెమోక్రాటిక్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్యే గట్టి పోటీ ఉంది. అయితే తాజాగా బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్ స్పందించారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో తాను ఎవరికి ఓటు వేస్తాననే విషయాన్ని ఎక్స్ వేదికగా చెప్పేశారు. ఈసారి తన ఓటు జో బైడెన్‌కే అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరలవుతోంది. Also Read: దేశవ్యాప్తంగా 157 యూనివర్సిటీల్లో లోపాలు.. యూజీసీ సంచలన ప్రకటన ఇంతకుముందు ఇలా అధ్యక్ష అభ్యర్థికి ఎప్పుడూ మద్దతు ప్రకటించలేదని.. ఈసారి జరగపోయే ఎన్నికలు మహిళలు, కుటుంబాలకు చాలా కీలకమైనవని అన్నారు. మహిళల భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక శక్తి, వ్యక్తిగత హక్కులను కాపాడే నాయకుడు కావాలని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలు పూర్తిగా భాగమయ్యే స్వేచ్ఛను కల్పించాలన్నారు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో డొనాల్డ్ ట్రంప్.. మహిళల ఆరోగ్యం, స్వేచ్ఛ, భద్రతను ప్రమాదంలో పడేసిందని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈసారి తన ఓటు జో బైడెన్‌కే అని చెప్పారు. Also Read: ప్రపంచవ్యాప్తంగా యోగా డే వేడుకలు.. I’ve never endorsed a presidential candidate before. But this year’s election stands to be so enormously consequential for women and families that, this time, I can’t stay quiet. Women deserve a leader who cares about the issues they face and is committed to protecting their… — Melinda French Gates (@melindagates) June 20, 2024 #usa #donald-trump #joe-biden #bill-gates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి