Road Accident: ఘోర ప్రమాదం.. త్రుటిలో తప్పించుకున్న మాజీ ముఖ్యమంత్రి..

జమ్మూకశ్మీర్‌లోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (PDP) అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్కికి పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మెహబూబా ముఫ్తీ క్షేమంగా ఉన్నట్లు ఆమె కూతురు ఇల్తిజా మీడియాకు తెలిపారు.

New Update
Road Accident: ఘోర ప్రమాదం.. త్రుటిలో తప్పించుకున్న మాజీ ముఖ్యమంత్రి..

జమ్మూకశ్మీర్‌లోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (PDP) అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్కి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఆమె ప్రయాణిస్తున్న కారు అనంత్‌నాగ్‌ జిల్లాలో ప్రమాదానికి గురైంది. మెహబూబా ముఫ్తీ క్షేమంగా ఉన్నట్లు ఆమె కూతురు ఇల్తిజా మీడియాకు తెలిపారు. అయితే ముఫ్రీ ప్రయాణిస్తున్న స్కార్కియో కారును మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆమెకు తోడుగా వచ్చిన భద్రతా అధికారి గాయపడ్డారు. కారు ముందుభాగం ధ్వంసమైనప్పటికీ ముఫ్రీ క్షేమంగా బయపడ్డారు.

Also Read: నెట్‌ఫ్లిక్స్, జీ స్టూడియోస్‌ నుంచి ‘అన్నపూరణి’ సినిమా ఔట్.. కారణం ఇదే

ఖానాబాల్‌ అగ్నిప్రమాదం బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కారు ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆమె పరామర్శకు వెళ్లారు. ఇదిలా ఉండగా.. జమ్మూ కశ్మీర్‌ 9వ ముఖ్యమంత్రిగా ఏప్రిల్ 4, 2016 నుండి జూన్ 19, 2018 వరకు పనిచేశారు. ఇక 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేశాక ఆమెను నిర్భందించి చివరికి 2020 అక్టోబర్‌లో విడుదల చేశారు.

Also Read: కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి.. కిషన్ రెడ్డి హెచ్చరికలు

Advertisment
తాజా కథనాలు