వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా మాట్లాడారు: ఎంపీ రఘురామ వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా మాట్లాడారన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కానీ.. సినిమా వాళ్ల గురించి మీకెందుకు అని బాగా గడ్డి పెట్టారని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ వైసీపీ సర్కార్ కి బుద్ధి వచ్చేలా మాట్లాడారని.. చిరంజీవి మాటలు ప్రశంసనీయం అంటూ కొనియాడారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. అలాగే పలు అంశాలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు రఘురామ. వలంటీర్ల అరాచకాలు ఎక్కువయ్యాయని.. వలంటీర్లకు నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. By E. Chinni 08 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ Scrolling New Update షేర్ చేయండి మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు ఎంపీ రఘురామకృష్ణ రాజు. చిరు కామెంట్స్ పైనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ నేతలు చిరంజీవిపై మండిపడుతున్నారు. కాసేపటి క్రితమే చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా మాట్లాడారన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కానీ.. సినిమా వాళ్ల గురించి మీకెందుకు అని బాగా గడ్డి పెట్టారని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ వైసీపీ సర్కార్ కి బుద్ధి వచ్చేలా మాట్లాడారని.. చిరంజీవి మాటలు ప్రశంసనీయం అంటూ కొనియాడారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. అలాగే పలు అంశాలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు రఘురామ. వలంటీర్ల అరాచకాలు ఎక్కువయ్యాయని.. వలంటీర్లకు నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. వలంటీర్లు కాలకేయులుగా మారారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసులో నిజ దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నా.. ఇలాగే సునీత పోరాటం స్ఫూర్తిగా కొనసాగాలని అన్నారు ఎంపీ రఘురామ. కాగా 'వాల్తేరు వీరయ్య' మూవీ 200 రోజుల ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి పరోక్షంగా వైసీపీ ప్రభుత్వంపై, మంత్రి అంబటి రాంబాబుపై వ్యాఖ్యలు చేవారు. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టులు గురించి ఆలోచించాలి. పేదల కడుపు నింపే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటని చిరంజీవి కామెంట్స్ చేశారు. అలాగే.. డిమాండ్ ఉన్న వారికి పారితోషికం ఎక్కువే ఇస్తారనిచెప్పారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. #chiranjeevi #ycp-government #megastar-chiranjeevi #mp-raghu-ramakrishna-raju #raghu-ramakrishna-raju #raghu-ramakrishna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి