చంద్రబాబు ప్రాణాలకు ముప్పు..గవర్నర్ కు ఎంపీ లేఖ..!!
చంద్రబాబును వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. చంద్రబాబు ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయన్నారు. డీహైడ్రేషన్, అలర్జీ సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని తెలిసిందని, ఆయన బరువు మరింతగా తగ్గితే కిడ్నీలు దెబ్బతినే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు జైల్లో ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే..