/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-18T124908.167-jpg.webp)
Megastar Chiranjeevi : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ షూటింగ్ మధ్యలో ఏ మాత్రం గ్యాప్ దొరికిన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కేటాయిస్తారు. ముఖ్యంగా తన వైఫ్ సురేఖ(Surekha) తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటారు. అంతే కాదు ఫ్యామిలీకి సంబందించిన ప్రతీ స్పెషల్ మూమెంట్స్(Special Moments) అభిమానులతో పంచుకుంటారు మెగాస్టార్. అయితే తాజాగా తన భార్య సురేఖ పుట్టినరోజు(Birthday) సందర్భంగా.. సోషల్ మీడియా ద్వారా బ్యూటిఫుల్ విషెష్ తెలియజేశారు.
Gaami Teaser : ‘ఇదే నీ సమస్యకు పరిష్కారం’.. థ్రిల్లింగ్ గా విశ్వక్ సేన్ గామీ టీజర్
భార్య సురేఖ కోసం మెగాస్టార్ బర్త్ డే విషెస్
”నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ.. నా భాగస్వామి సురేఖ అంటూ అద్భుతమైన కవితతో విషెస్ చెప్తూ.. ఇద్దరు కలిసి దిగిన స్పెషల్ ఫోటో(Special Photo) ను షేర్ చేశారు. "నా జీవిత రేఖ.. నా విజయానికి, బలానికి ముఖ్యకారమైన సురేఖకు పుట్టిరోజు శుభాకాంక్షలు. అని ట్విట్టర్(X) వేదికగా భార్యకు విషెష్ తెలియజేశారు మెగాస్టార్. ఒక చిన్న కవితతో మెగాస్టార్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.
నా జీవన రేఖ
నా సౌభాగ్య రేఖ
నా భాగస్వామి సురేఖ !Happy Birthday to my lifeline and the greatest pillar of my strength Surekha !
Many Many Happy Returns!💐❤️ pic.twitter.com/JcABQQ1Aey— Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2024
Sharmila son Haldi photos : షర్మిల కుమారుడు రాజారెడ్డి హల్దీ వేడుకలు.. వైరలవుతున్న ఫొటోలు