Paris Olympics: మరో రెండ్రోజుల్లో పారిస్‌ ఒలింపిక్స్‌.. బరిలోకి భారత్‌ నుంచి 14 ఏళ్ల బాలిక

ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌లో జులై 26 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌ గేమ్స్‌.. ఆగస్టు 11 వరకు జరుగనున్నాయి. 206 దేశాల నుంచి మొత్తం 10,714 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు. భారత్‌ నుంచి కర్ణాటకకు చెందిన ధినిధి దేశింగు (14) ఈ గేమ్స్‌లో పాల్గొననుంది

New Update
Paris Olympics: మరో రెండ్రోజుల్లో పారిస్‌ ఒలింపిక్స్‌.. బరిలోకి భారత్‌ నుంచి 14 ఏళ్ల బాలిక

Dhinidhi Desinghu : నాలుగేళ్లకొకసారి నిర్వహించే ఒలింపిక్స్‌ గేమ్స్ సమయం ఆసన్నమైంది. ఈసారి ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌లో ఒలింపిక్స్‌ గేమ్స్ (Paris Olympics 2024) జరగనున్నాయి. జులై 26 నుంచి ప్రారంభం కానున్న ఈ విశ్వక్రిడలు.. ఆగస్టు 11 వరకు 17 రోజుల పాటు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా  206 దేశాల నుంచి మొత్తం 10,714 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొంటారు. 32 క్రీడలకు సంబంధించి 329 విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇక భారత్ నుంచి ఈసారి 117 మంది క్రీడాకారులు ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు. ఇండియా టీమ్‌కి టార్చ్‌ బేరర్లుగా పీవీ సింధు, శరత్ కమల్‌ వ్యవహరించనున్నారు. అయితే ఒలింపిక్స్‌లో భారత్‌ ప్రస్తానం ఆర్చరీ పోటీలతో ప్రారంభమవుతుంది. జులై 27న బ్యాడ్మిండన్‌, బాక్సింగ్.. ఆగస్టు 1 నుంచి 11 వరకు అథ్లెటిక్స్‌ జరుగుతాయి. అలాగే జూన్ 27 నుంచి ఆగస్టు 8 వరకు హాకీ పోటీలు, జులై 27 నుంచి ఆగస్టు 5 వరకు షూటింగ్ పోటీలు జరుగుతాయి.

Also Read: పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేస్తున్న అఖిల పక్ష భారత ఎంపీలు!

మన ఇండియా నుంచి కర్ణాటకకు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక కూడా పారిస్‌ ఒలింపిక్స్‌కు ఎంపిక కావడం విశేషం. ధినిధి దేశింగు అనే యువతి స్విమ్మింగ్‌లో (Indian swimmer) 200 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో భారత్‌ నుంచి పోటీపడుతోంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అతిచిన్న వయసు ఉన్న అథ్లెట్లలో ఒకరిగా ధినిధి దేశింగు నిలిచింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని సీవీ రామన్‌నగర్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. 2010 మే 17న జన్మించిన ధినిధి.. 2018 నుంచి స్విమ్మింగ్‌లో ట్రైనింగ్ తీసుకోవడం ప్రారంభించింది. తక్కువ కాలంలోనే జూనియర్, సబ్ జూనియర్ స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించింది. అంతేకాదు గోవాలో జరిగిన నేషనల్ గేమ్స్‌లో కూడా ఏడు గోల్డ్‌ మెడల్స్ సాధించింది.

1952లో జరిగిన ఒలింపిక్స్‌ గేమ్స్‌కు భారత్‌ నుంచి ఆర్తి సాహా అనే 11 ఏళ్ల బాలిక అర్హత సాధించింది. ఆ తర్వాత అతి తక్కువ వయసులో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న అథ్లెట్‌గా ధినిధి రికార్డు సృష్టించింది. ఆర్తి సాహా కూడా స్విమ్మింగ్‌ ఈవెంట్‌లోనే ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యింది. ఇప్పుడు జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో చైనాకు చెందిన జాంగ్‌ హోహో అనే అమ్మాయి అతి తక్కువ వయసున్న క్రీడాకారిణిగా నిలిచింది. ఈమె వయస్సు 11 సంవత్సరాలు 11 నెలలు మాత్రమే. ఈ వయసులోనే ఆమె స్కెటింగ్స్‌ గేమ్స్‌లో పతకం కోసం బరిలోకి దిగనుంది.

Also Read: మళ్లీ విజృంభిస్తున్న హెచ్‌ఐవీ.. నిమిషానికి ఒకరు మృతి!

ఇక ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న అతిపెద్ద అథ్లెట్లలో కెనడాకు చెందిన మహిళ నిలించింది. జిల్‌ ఇర్వింగ్‌ అనే మహిళ 61 ఏళ్ల వయసులో ఎంతో కఠినంగా ఉండే ఈక్వెస్ట్రియన్ గేమ్స్‌లో ఈమె పాల్గొననుంది. అయితే జిల్‌ ఇర్వింగ్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫై అవ్వడం ఇదే మొదటిసారి. 61 ఏళ్లకు ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన అతిపెద్ద వయస్కురాలిగా ఈమె రికార్డు సృష్టించింది. ఇండియా నుంచి ఈ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న అథ్లెట్లలో అతిపెద్ద వయస్కుడిగా రోహన‌ బోపన్న నిలిచాడు. కర్ణాటకకు చెందిన రోహన్‌ బోపన్న వయసు ప్రస్తుతం 44 ఏళ్లు.

Advertisment
తాజా కథనాలు