ఇటీవల మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యయత్నం జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభాకర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలనుద్దేశించి మాట్లాడిన వీడియోను ఆయన కుమారుడు, నాయకులు గురువారం విడుదల చేశారు. దేవుని దయ, నియోజకవర్గ ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీస్సులతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పడిప్పుడే కోలుకుంటున్నానని.. నున్ను చూసేందుకు అభిమానులు ఎవరూ హైదరాబాద్‌కు రావొద్దని కోరారు. వారం రోజుల్లో నేనే నియోజవర్గ ప్రజల ముందుకు వస్తానని స్పష్టం చేశారు.
Also Read: అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కత్తిపోట్లు.. వైద్యులు ఏం చెప్పారంటే
Also Read: కేసీఆర్ అవినీతిలో కాళేశ్వరం మునిగింది.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..!!
అక్టోబర్ 30న సిద్దిపేట జిల్లా సూరంపల్లి గ్రామంలో ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేస్తున్న సమయంలో ఆయనపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. కడుపులో తీవ్రగాయం కావడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దాడి సమయంలో రాజుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సూరంపల్లి గ్రామ సర్పంచ్ నరసింహులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రాజుపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. హత్యాయత్నం వెనుక కుట్ర దాగి ఉందా అనే కోణంపై దర్యాప్తు కొనసాగుతోంది. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు మరింత భద్రతను పెంచింది. ప్రస్తుతం ఉన్న 2+2గా ఉన్న భద్రతను 4+4కు పెంచేసింది. అన్ని జిల్లాల అధికారులకు ఇంటెలిజెన్స్ డీజీ ఆదేశాలు జారీ చేశారు.