Feeding Meat Dogs: కుక్కలకు పచ్చిమాంసం తినిపిస్తే మీకే ప్రమాదం

పచ్చిమాంసం తిన్న కుక్క నమూనాల్లో E.కోలి బ్యాక్టీరియా రకాన్ని గుర్తించామని సైంటిస్టులు వెల్లడించారు. పరిశుభ్రత సరిగా లేని పచ్చి మాంసం తినడం వల్ల కుక్కలు విసర్జిస్తుండడంతో మనుషుల్లో ఇన్ఫెక్షన్​ ముప్పు పెరిగిపోతుందని చెబుతున్నారు.

New Update
Feeding Meat Dogs: కుక్కలకు పచ్చిమాంసం తినిపిస్తే మీకే ప్రమాదం

Feeding Meat Dogs: కుక్క అనగానే మనకు ఓ సామేత గుర్తుకు వస్తుంది. కుక్కకి ఉన్న విశ్వాసం మనుషులకు లేదని సామెత ప్రతీ ఒక్కరు వాడేస్తారు. ఆది పాత సమేత అయినా.. నిజంగా కుక్క చూపించే ప్రేమను వర్ణించలేము. మాయ మాటలతో మోసం చేసే మనుషులకన్నా.. మాటలు రాని ముగ జీవుల ప్రేమ ఎంతో గొప్పది. కుక్కలు అంటే సాధారణంగా అందరికీ ఇష్టంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటున్నారు. కుక్కల్ని పెంచుకుంటుంటే వాటి ప్రేమ చూస్తే మనకే ఎంతో ఆశ్చర్యమేస్తుంది. ఇలా పెంచుకున్న కుక్కల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు వీటిని జీవితంలో, ఇంట్లో ఒక మనిషి లాగ చేసుకుంటున్నారు. అయితే.. వాటికోసం ప్రత్యేక ఆహారం పెట్టడంతో, వాటి సంరక్షణకు ఎన్నో డబ్బులు ఖర్చు చేసేవారు కూడా ఉన్నారు. అయితే.. వాటికి పెట్టే భోజనం గురించి ముఖ్య విషయాన్ని చెబుతున్నారు పశు వైద్య నిపుణులు. కుక్కలు పచ్చి మాంసం తినడం వల్ల పెట్టడం వల్ల మనుషులకు వచ్చే సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కుక్కలకి ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చి మాంసం కుక్కలకు కలిగే నష్టాలు:

కొందరూ కుక్కలకు ఏదిపడితే అది ఆహారంగా పెడతారు. మరి కొందరైతే పచ్చి మాంసం కూడా పెడతారు. యూకేకు చెందిన సైంటిస్టులు పచ్చి మాంసం తిన్న హెల్తీగా ఉన్న 600 కుక్కలపై కుక్కలపై కొన్ని పరిశోధనలు చేశారు. పరిశుభ్రత సరిగా లేని పచ్చి మాంసం తినడం వల్ల కుక్కలు విసర్జిస్తుండడంతో మనుషుల్లో ఇన్ఫెక్షన్​ ముప్పు పెరిగిపోతుందని చెబుతున్నారు. పచ్చిమాసం తిన్నప్పుడు E. కోలి బ్యాక్టీరియాను విసర్జిస్తాయట. ఈ బ్యాక్టీరియా ఫ్లోరోక్వినోలిన్ అనే యాంటీ బయాటిక్​ను సైతం డామినేట్ చేస్తుందని తేలింది. పచ్చిమాంసం తిన్న వాటి నమూనాల్లో E.కోలి బ్యాక్టీరియా రకాన్ని గుర్తించామని సైంటిస్టులు వెల్లడించారు.
ఇద కూడా చదవండి: మేకపాలు తాగవచ్చా..ఎలాంటి పోషకాలు ఉంటాయి.?

అంతేకాదు.. కుక్కలకు పచ్చి మాంసాన్ని స్వయంగా తినిపించం వల్ల మనుషుల్లోనూ అనేక ఇన్ఫెక్షన్ల వస్తాయని చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా మనుషుల పేగుల్లో కొన్ని ఏళ్ల పాటు నిల్వ ఉంటుందట. ఆ తర్వాత ట్రీట్‌మెంట్‌ ఇచ్చినా కష్టమయ్యే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు సైంటిస్టులు. అయితే.. గ్రామీణ, పట్టణా కుక్కల్లో మలంలో E. కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారట. ఈ బాక్టీరియాకు ప్రధాన కారణం పచ్చి మాంసం తినిపించడమే అని వారు వెల్లడించారు. అయితే.. కుక్కలకు ముఖ్యంగా ఉల్లిగడ్డలు, మష్రూమ్ ,టమాటలు, పచ్చి మాంసం, చెర్రీ, ద్రాక్ష పండ్లను అస్సులు పెట్టకూడదు. వీటివల్ల కుక్కల రక్త కణాలపై ప్రభావం, కంటి చూపు సమస్య, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు