MEA: అమెరికా మత స్వేచ్ఛ నివేదికపై భారత్ కీలక వ్యాఖ్యలు

అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ రిపోర్టు 2023పై భారత్ స్పందించింది. ఇది పూర్తిగా పక్షపాత వైఖరితో కూడిందని.. ఈ నివేదికను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.

New Update
MEA: అమెరికా మత స్వేచ్ఛ నివేదికపై భారత్ కీలక వ్యాఖ్యలు

అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ రిపోర్టు 2023పై భారత్ స్పందించింది. ఇది పూర్తిగా పక్షపాత వైఖరితో కూడిందని.. ఈ నివేదికను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. భారత్‌లో ఉన్న సామాజిక కూర్పును అర్థం చేసుకోకుండా.. కేవలం ఓట్‌బ్యాంక్ రాజకీయాల ఆధారంగా మాత్రమే ఆ రిపోర్టు తయారు చేసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

Also Read: నీట్‌ పేపర్‌ స్కామ్.. విద్యార్థులకు రాహుల్ కీలక సందేశం

ఆ రిపోర్టులో పొరపాట్లు ఉన్నట్లు తెలిపారు. ఎంపిక చేసుకున్న అంశాలను వాళ్లకి కావాల్సిన చోట అన్వయించుకున్నారని.. దీన్ని పక్షపాత వైఖరితోనే తయారు చేసినట్లు ఆరోపించారు. భారత వ్యతిరేక కథనాన్ని చూపించేందుకు కొన్ని ఘటనలను మాత్రమే ఆ నివేదిక ప్రస్తావించిందని.. చట్టాలు, నిబంధనల చెల్లుబాటును ప్రశ్నించిందని పేర్కొన్నారు. భారత కోర్టులు ఇచ్చిన పలు తీర్పుల విశ్వసనీయతను కూడా ఇది సవాలు చేసేలా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

Advertisment
తాజా కథనాలు