Cricket : ఒక్క మ్యాచ్ అతని జీవితాన్ని మార్చేసింది.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన స్పీడ్‌గన్ మయాంక్

మయాంక యాదవ్...ఇప్పుడు ఇతడొక సంచలనం. అత్యంత వేగంగా బంతులు విసురుతూ బ్యాటర్లకు దడ పుట్టిస్తున్న ఈ బౌలర్‌ను అందుకోవడం ఎవ్వరి వల్లా కావడం లేదు. అయితే ఇతని వేగం కేవలం బంతులను విసరడంలో మాత్రమే చూపించడం లేదు...ఇన్స్టా యూజర్లను పెంచుకోవడంలో కూడా చూపిస్తున్నాడు.

Cricket : ఒక్క మ్యాచ్ అతని జీవితాన్ని మార్చేసింది.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన స్పీడ్‌గన్ మయాంక్
New Update

IPL : ఐపీఎల్ అందించిన మరో అద్భుతం మయాంక్ యాదవ్(Mayank Yadav). ఈ మొత్తం సీజన్ అంతటికీ ఇతనే హీరో. అప్పుడెప్పుడో ఒకప్పుడు భారత క్రికెట్ జట్టు(Indian Cricket Team) లో ఫాస్ట్ బౌలర్స్ ఉండేవారు. ఆ తరువాత వాళ్ళ అత్తా పత్తా లేకుండా పోయింది. కేవలం స్పిన్ మీదనే ఆధారపడి ఆడేస్తోంది టీమ్ ఇండియా(Team India) ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు ఈ కొరత తీర్చడానికి యువ సంచలనం మయాంక్ యాదవ్ వచ్చేశాడు. శ్రీనాథ్, బ్రెట్ లీ, మెక్‌ గ్రాత్‌ లాంటి వాళ్ళని తలపిస్తున్న మయాంక్ సంచలనంగా మారాడు. 155 కి.మీ స్పీడ్‌తో బంతులను విసురుతూ బ్యాటర్ల వెన్నులో వణుకును పుట్టిస్తున్నాడు. ఇతను ఇలాగే కంటిన్యూ చేస్తే చాలా పెద్ద బౌలర్, టీమి ఇండియాకు వెన్నుముక అవడం గ్యారంటీ.

ఐపీఎల్ సీజన్, అతని బౌలింగ్ ప్రతిభ మయాంక్‌ని ఒక్కసారిగా సెలబ్రిటీ చేసేసింది. ఇప్పుడు ఎవ్వరి నోట విన్నా ఇతని మాటే వినిపిస్తోంది. ఇతని బౌలింగ్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు కూడా. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా మయాంక్ సైపర్ పాపులర్ అయిపోయాడు. అక్కడ కూడా ఇతని ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. ఇంతకు ముందు నుంచి ఇన్స్టాలో మయాంక్ ఉన్న ఆపెద్దగా ఎవ్వరూ ఫాలో అయింది లేదు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి సడెన్‌గా ఇతని ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది.

ఐపీఎల్‌లో పంజాబ్‌తో అయిన మ్యాచ్ మయాంక్ జీవితాన్ని మార్చేసింది. అప్పటి వరకు మయాంక్ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఒవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ మ్యాచ్‌కు ముందు తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కేవలం 4 వేలు ఉండేవారు. కానీ అది అయిన తర్వాత ఆ సంఖ్య ఒక్కసారిగా 15.8kకు పెరిగిపోయింది అంటున్నాడు మయాంక్. ఇప్పుడు అయితే ఫాలోవర్స్ సంఖ్య దాదాపుగా 60వేలకు చేరుకుందని చెబుతున్నాడు.

Also Read:Telangana : నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు

#cricket #mayank-yadav #ipl-2024 #fast-bowler
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe