Bank Holidays : మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!

మే నెలలో బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన సెలవులను తాజాగా ఆర్బీఐ ప్రకటించింది. ‘మే’ నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పుడు తాజాగా ఆర్బీఐ ప్రకటించిన సెలవులను చూసుకుని మీకు బ్యాంకులో పని ఉన్నట్లయితే దానిని ఎలా ప్లాన్‌ చేసుకోవాలో చూసుకోండి మరీ...

Bank Holidays: జులైలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..!
New Update

May : మరో నాలుగు రోజుల్లో ఏప్రిల్‌ నెల కూడా అయిపోతుంది. మే నెల వచ్చేస్తుంది. మే నెలలో బ్యాంకు ఖాతాదారులకు(Bank Account Holders) సంబంధించిన సెలవులను తాజాగా ఆర్బీఐ(RBI) ప్రకటించింది. ‘మే’ నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు రెండు వారాల పాటు బ్యాంకులకు సెలవులు(Bank Holidays) వచ్చినట్లు వచ్చేశాయి.

ఈ సెలవుల లిస్టులో రెండు, నాలుగు శనివారాలతో కలిపి ఆదివారాలు కూడా ఉండగా.. కొన్ని సెలవులు రాష్ట్రం, ప్రాంతం బట్టి మారాతాయనే విషయాన్ని వినియోగదారులు గమనించాలి. ఇప్పుడు తాజాగా ఆర్బీఐ ప్రకటించిన సెలవులను చూసుకుని మీకు బ్యాంకులో పని ఉన్నట్లయితే దానిని ఎలా ప్లాన్‌ చేసుకోవాలో చూసుకోండి మరీ...

మరి ఏ రోజు.. ఏ రాష్ట్రంలో సెలవు ఉందో ఓ లుక్‌ వేద్దామా..

మే 01 (బుధవారం): కార్మిక దినోత్సవం(May Day) సందర్భంగా బ్యాంకులకు సెలవు.

మే 05: ఆదివారం.

మే 08 (బుధవారం): రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్కతా లోని అన్ని బ్యాంకులు బంద్.

మే 10: ‍‌(శుక్రవారం): బసవ జయంతి/ అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులో బ్యాంకులకు సెలవు.

మే 11: రెండో శనివారం.

మే 12: ఆదివారం.

మే 16: (గురువారం): గ్యాంగ్‌టక్‌ రాష్ట్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రములోని అన్ని బ్యాంకులకు సెలవు

మే 19: ఆదివారం.

మే 20 ‍‌(సోమవారం): బేలాపూర్, ముంబైలోని లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా బ్యాంకులను మూసేస్తారు.

మే 23: ‍‌(గురువారం): బుద్ధ పూర్ణిమ సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, ఇటానగర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూదిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులు బంద్.

మే 25: నాలుగో శనివారం.

మే 26: ఆదివారం. వీటిని బట్టి మీ బ్యాంకు పనులను ప్రణాళిక వేసుకోండి.

Also read: వడదెబ్బ చర్మ క్యాన్సర్‌ కు కారణం అవుతుందా.. ?

#bank-holidays #rbi #may #bank-account-holders
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe