Match Fixing: టీ20 వరల్డ్‌కప్‌లో ఉగాండా లీగ్ దశలోనే తొలిగింది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఓడి పోయి టోర్ని నించి నిష్క్రమించింది. అయితే ఇప్పుడు ఈ టీమ్‌కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఇందులో ఓ ప్లేయర్‌ను ఫిక్సింగ్‌కు సంబంధించి కెన్యా మాజీ క్రికెటర్ సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. మూడు మ్యాచ్లలో ఎలాగైనా ఫిక్సింగ్ చేయించాలని ఓ కెన్యా మాజీ ఆటగాడు పలుమార్లు వేరువేరు ఫోన్ నెంబర్లతో ఉగాండా ఆటగాడిని సంప్రదించారని సమాచారం. ఈ విషయాన్ని తాజాగా ఐసీసీకి చెందిన ఓ అధికారి మీడియాకి తెలిపారు. అయితే ఇందులో ఎవరెవరు ఉన్నారన్నది మాత్రం పేర్లు ఇంకా బయటకు రాలేదు.
దీనంతటి వెనుకా కెన్యా మాజీ క్రికెటర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉగాండా ఆటగాడు ఫిక్సింగ్ గాలానికి పడలేదు. అతను నేరుగా వెళ్ళి అ విషయాన్ని ఐసీసీఐలో చెప్పడంతో ముందుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఐసీసీ వీలైనంత త్వరగా విచారణ చేపడతామని.. ఆరోపణలకు తగ్గ ఆధారాలు లభిస్తే నిందితులను కచ్చితంగా శిక్షిస్తామని వారు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో ఉగండా గ్రూప్ సీలో ఉండగా.. మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడగా అందులో కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి టోర్నీ నుండి నిష్క్రమించింది.