TS : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు..!

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. మొత్తం 44 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి ప్రమోషన్‌ ఇచ్చారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా రోనాల్డ్‌ రాస్‌ను నియమించారు.

New Update
TS : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు..!

Telangana : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ (IAS), ఐపీఎస్‌ (IPS) ల బదిలీలు జరిగాయి. మొత్తం 44 మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ (GHMC) కమిషనర్‌గా ఆమ్రపాలి (Amrapali) కి ప్రమోషన్‌ ఇచ్చారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా రోనాల్డ్‌ రాస్‌, టూరిజం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా వాణీప్రసాద్‌, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా శైలజారామయ్యర్‌, రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాష్‌ ను నియమించారు.

Also Read: తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె.. విధులు బహిష్కరించి ఆందోళన..!

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా ఐజీ రంగనాధ్‌, ఆర్‌అండ్‌బి స్పెషల్‌ సెక్రటరీగా హరిచందన, సోషల్‌ వెల్ఫేర్‌ శాఖ సెక్రటరీగా అలుగు వర్షిణి, లోటస్‌ పాండ్‌లో జగన్‌ ఇంటి దగ్గర నిర్మాణాలను కూల్చివేసి బదిలీ అయిన హేమంత్‌కు TG మెడికల్‌ సర్వీసెస్‌ ఎండీ పోస్ట్‌ ఇచ్చారు. వీరితో పాటు మరికొందరిని బదిలీ చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు