ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లోని జై భవానీ అనే 5 అంతస్తుల భవనంలో గురువారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. భవనం కింది అంతస్తులోని దుకాణాలతో పాటు పార్కింగ్‌లో నిలిపి ఉంచిన వాహనాల్లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఇది కూడా చదవండి: మధ్యాహ్నం కాస్త కునుకు తీస్తే చాలు..బరువు తగ్గడంతోపాటు ఈ వ్యాధులన్నీ పరార్..!!
ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు:
అగ్నిమాపక శాఖకు చెందిన 10 వాహనాలు గోరేగావ్ వెస్ట్‌కు చెందిన జై భవానీ అనే భవనంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశాయి. ఈ భారీ అగ్నిప్రమాదంలో 40 మంది గాయపడగా, 6 మంది మరణించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 25 మంది క్షతగాత్రులను హెచ్‌బిటి ఆసుపత్రిలో చేర్చగా, 15 మంది క్షతగాత్రులు కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కూపర్ ఆసుపత్రిలో చేరిన క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
గత అర్థరాత్రి ఓ భవనంలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిందని బీఎంసీ అధికారులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించామని తెలిపారు. ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లోని 5 అంతస్తుల భవనంలో లెవల్ 2 అగ్నిప్రమాదం జరిగింది. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు.