Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. 22 మంది మృతి

గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజ్‌కోట్‌ జిల్లాలోని టీఆర్‌పీ గేమింగ్‌ జోన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరికీ తీవ్ర గాయాలయ్యాయి.

New Update
Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. 22 మంది మృతి

గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజ్‌కోట్‌ జిల్లాలోని టీఆర్‌పీ గేమింగ్‌ జోన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. మరికొందరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

శనివారం కావడంతో గేమింగ్‌జోన్‌లో భారీగా రద్దీ నెలకొంది. షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసుల అంచనా వేస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండానే గేమింగ్‌ జోన్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. బాధితులకు అన్ని రకాల సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

Also read: యూపీలో పార్టీల హార్ట్ బీట్ పెంచుతున్న ఆ సీట్లు.. తేడా వస్తే అంతే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు