Earthquake : జపాన్‌లో భారీ భూకంపం.. హెచ్చరికలు జారీ!

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 7.1గా నమోదైంది. 5 నిమిషాల పాటు భూమి కంపించింది. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. భూకంపం ప్రభావంతో అప్రమత్తమైన ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Earthquake : జపాన్‌లో భారీ భూకంపం.. హెచ్చరికలు జారీ!
New Update

Japan Earth Quake : జపాన్‌లో భూకంపం (Earthquake) కలకలం రేపింది. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 7.1గా నమోదైంది. 5 నిమిషాల పాటు భూమి కంపించింది. వందల సంఖ్యలో ఇండ్లు నేలమట్టం అయ్యాయి. దక్షిణ జపాన్‌లోని క్యుషు, షికోకులోని అనేక ప్రాంతాల్లో భూమి కంపించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. హ్యుగా-నాడా సముద్రంలో భూకంపం సంభవించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. భూకంపం ప్రభావంతో మీటర్‌ ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాలు, నదులు, సరస్సులు సమీపంలో నివసించే వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది అక్కడి ప్రభుత్వం.

Also Read : మరోసారి బయటపడ్డ మేఘా నిర్వాకం.. కుప్పకూలిన ప్రహారీ గోడ

#earthquake #japan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe