ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం...భయంతో పరుగులు పెట్టిన జనం..!!

Pithoragarh Earthquake: భారత్‌లో భూకంపం.. తప్పిన ప్రమాదం
New Update

ఫిలిప్పీన్స్ లో మరోసారి భూకంపం సంభవించింది. శుక్రవారం దక్షిణ ఫిలిప్పిన్స్ మిందానో ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.9తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జర్మనీ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. అయితే పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం మాత్రం సునామీ వచ్చే ఛాన్స్ లేదని..భూకంప నష్టంపై తక్షణ సమాచారం లేదని ప్రకటించింది. అయితే అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు ఫిలిప్పీన్స్ సిస్మాలజీ ఏజెన్సీ సూచించింది.

తాను ఇప్పటివరకు చూసిన భూకంపాల్లో ఇదే బలమైన భూకంపం అని స్థానికుడు తెలిపాడు. దీంతో జనం భయంతో పరుగులు పెట్టారు. భూకంప కేంద్రం నుంచి 200కిలోమీటర్ల దూరంలో ఉన్న దావో సిటీలో జరిగే సమావేశానికి ఆమె హాజరనుకానున్నట్లు తెలిపారు. బలమైన భూకంపంతో గోడలు పగులు పెట్టాయని, కంప్యూటర్లు కిందపడిపోయాయని దక్షిణ కోటాబాటోలోని జనరల్ శాంటోస్ నగరానికి చెందిన రేడియో అనౌన్సర్ లేనీ అరనెగో తెలిపారు. జనరల్ శాంటాస్ సిటీ విమానాశ్రయంలోని ప్రయాణికులను టార్మాక్ కు తరలించినట్లు వెల్లడించారు.

జపాన్ నుంచి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్రమైన భూకంప, అగ్నిపర్వత కేంద్రం రింగ్ ఆఫ్ ఫైర్ వెంట ఉన్న ఫిలిప్పీన్స్ లో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. దీంతోపాటు గత 10 రోజుల్లో పలు దేశాల్లో భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: అదుపు తప్పిన చంద్రయాన్ -3..భూ వాతావరణంలోకి రాకెట్ భాగం..!!

#usa #earthquake #philippines #geological-survey
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe