Winter Care: చలికాలంలో పిల్లలకు ఈ నూనెతో మసాజ్ చేస్తే వ్యాధులు పరార్

చిన్న పిల్లలకు స్నానానికి ముందు నూనెతో మసాజ్ చేస్తారు. పిల్లలకు మసాజ్ చేయడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. నువ్వుల, ఆవాల నూనె, ఆల్మండ్ ఆయిల్‌తో బేబీకి మసాజ్ చేస్తే వ్యాధులు దరిచేరవు. ఈ నూనె పిల్లల ఛాయను, కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తుంది.

New Update
Winter Care: చలికాలంలో పిల్లలకు ఈ నూనెతో మసాజ్ చేస్తే వ్యాధులు పరార్

Winter Care: చిన్న పిల్లలకు ఆయిల్ మసాజ్ (Massage) చేయడం వల్ల కండరాలు, ఎముకలు బలపడతాయి. దీంతో శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అందువల్ల పిల్లలకు ఆయిల్ మసాజ్ చేయడం మంచిది. చలిలో కూడా పిల్లల (children)కు ఆయిల్ మసాజ్ చేస్తారు. అయితే.. చలికాలం (winters)లో శిశువుకు ఏ నూనెతో మసాజ్ చేస్తున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు సీజన్ ప్రకారం సరైన నూనెను ఎంచుకోవాలి. ఎందుకంటే ఇది కండరాలు, ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

చలికాలంలో పిల్లలకు ఏ నూనెతో మసాజ్ చేయాలంటే..

నువ్వుల నూనె: నువ్వుల నూనెను తీపి నూనె అని కూడా అంటారు. ఈ నూనె బేబీ మసాజ్‌కి మంచిదని భావిస్తారు. ఈ నూనె చలికాలంలో పిల్లల చర్మాన్ని బాగా తేమ చేస్తుంది. దీంతో శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.

ఆవాల నూనె: ఆవాల నూనెను కొద్దిగా వేడి చేసి..ఆపై పిల్లలకి మసాజ్ చేయాలి. ఈ నూనెలో వెల్లుల్లి, మెంతి గింజలను మిక్స్ చేసి వేడి చేసి మసాజ్ చేయాలి. మస్టర్డ్ ఆయిల్ పిల్లల ఎముకలు, కండరాలకు మేలు చేస్తుంది.

ఆల్మండ్ ఆయిల్: ఆల్మండ్ ఆయిల్‌లో పోషకాలు, మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నూనె శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. చలికాలంలో ఈ నూనెతో మసాజ్ చేయడం ఉత్తమం. బాదం నూనెలో విటమిన్-ఇ, అనేక రకాల ఖనిజాలు ఉన్నాయి. ఇది జుట్, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.ఈ నూనె పిల్లల ఛాయను మెరుగుపరచడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: పైల్స్ సమస్యతో బాధపడేవారు వీటికి కచ్చితంగా దూరంగా ఉండాలి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: లవంగాలు తింటే పురుషుల్లో ఆ సామర్థ్యం పెరుగుందట.. ఏ టైంలో తినాలంటే..!!

Advertisment
తాజా కథనాలు