RAVITEJA :ఆయుధం తో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు .. ఆయుధంతో విధ్వంసాన్ని ఆపేవాడు దేవుడు .ఈ దేవుడు మంచోడు కాదు.. మొండోడు.. ఈగల్ సినిమాలో రవితేజ చెప్పిన ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమా ఏ రేంజ్లో ఉంటుందో.. అందుకే మొండోడిలా ఎనీ టైం . ఎనీ సెంటర్ అంటూ సినిమా వాయిదా వేసుకున్నాడు., మాస్ మహారాజా రవితేజ సినిమాలంటే అదో కిక్కు. కామెడీతో కడుపుబ్బనవ్వించగలడు, యాక్షన్ తో ఊర మాస్ లు లోనూ అలరించగలడు. ఆయన సినిమాలకు మినిమం గ్యారంటీ ఉంటుంది. పలానా డేట్ లో వస్తేనే కలెక్షన్లు వస్తాయి అనే వ్యాపార సూత్రాలు లేవు కాబట్టే సంక్రాంతి బరిలో నుంచి అవుట్ అయి సేఫ్ గా సోలో రిలీజ్ సో బెటరు అంటూ ఫిబ్రవరి 9 కె ఫిక్స్ అయ్యాడు . అయితే చిత్ర యూనిట్ స్వయానా తీసుకున్న నిర్ణయమా ? ఇండస్ట్రీ పెద్దలు ప్రెజర్ పెట్టారా అనే విషయాలపై ఫిలిం సర్కిల్స్ లో చర్చ జోరుగా కొనసాగుతోంది.
జనవరి 26 న రవితేజ బర్త్ డే
ముందుగా జనవరి 13 న ఈగల్ మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ..సంక్రాంతికి వరుస 5 సినిమాలు రిలీజవడం ఎవరికీ సరైన న్యాయం జరగదని అందుకోసం నిర్మాతలు మీటింగ్ పెట్టి డ్రాప అయినవారికి సోలో రిలీజ్ అత్యధిక థియేటర్స్ తో ఇవ్వడం జరుగుతుందని ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని ఈగల్ చిత్ర నిర్మాతలు సద్వినియోగం చేస్కోవడం జరిగింది. ఈ నెల 26 న రవితేజ బర్త్ డే. సంక్రాంతికి రిలిజ్ అయినా, ఫిబ్రవరి 9 న రిలీజయినా బర్త్ డే సెలబ్రేషన్స్ కు సినిమా కలిసి వస్తుంది. పైగా రవితేజ సినిమాలకు డేట్ ఏదయినా సమస్యే లేదు.
సీజన్ తో పని లేదు. ఎనీ టైం .. ఎనీ సెంటర్
అందులోనూ ఈగల్ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే మైండ్ బ్లోయింగ్ గ ఉండటంతో ఎప్పుడు రిలీజయినా వసూళ్లకు డోకా ఉండదని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సో.. దిల్ రాజు మాట ఇచ్చినట్లే .. ఫిబ్రవరి 9 సోలో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. అదే రోజు సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సైతం డేట్ ఫిక్స్ చేశారు. పరిస్థితులు చూస్తుంటే సిద్ధూ ఈ సారి కూడా వెనక్కి తగ్గాల్సి వస్తోంది. సో.. ఏదేమయినా రవితేజ $ కో ఎవరి ప్రెజర్ తోనో సినిమా వాయిదా నిర్ణయం తీసుకోలేదు. సినిమాపై ఉన్న నమ్మకంతోనే సింగిల్ గా రావాలని డిసైడ్ అయ్యారు. రవితేజ సినిమాలకు సీజన్ తోపని లేదు. ఎనీ టైం .. ఎనీ సెంటర్ అన్నంతలా ఆయన సినిమాలకు వసూళ్ళుంటాయి. అందుకోసమే ఫిబ్రవరి 9 కి వాయిదా వేసుకున్నారు.
ALSO READ:Trivikram Srinivas : దర్శకుడు త్రివిక్రమ్ కు కలిసొచ్చిన కాపీ కథలు