ప్రపంచ బాక్సింక్‌లో ఆరుసార్లు ఛాంపియన్‌గా గెలిచిన ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్యారీస్‌లో జరగనున్న ఒలింపిక్స్ బృందానికి చీఫ్ డీ మిషన్‌గా వైదొలగినట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ పోస్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఇచ్చిన నిబద్ధత నుంచి వెనక్కి తగ్గడం బాధాకరంగా ఉన్నట్లు తెలిపారు. తనకు ఎలాంటి ఛాయిస్ లేదని అందుకే ఈ పోస్టు నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నారు.
Also Read: అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు వ్యక్తి..
మేరీ కోమ్ తన పోస్టుకు రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాశారని.. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు పీటీ ఉష ప్రకటించారు. ఇదిలాఉండగా.. ఈ ఏడాది జులై 26 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ప్యారిస్‌లో ఒలంపిక్ గేమ్స్ జరగనున్నాయి. నాలుగేళ్లకొకసారి నిర్వహించే ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో ఎన్నో దేశాలకు చెందిన క్రీడాకారులు వివిధ గేమ్స్‌లో పాల్గొంటారు.
Also Read: పోలీసులకు అర్చకుల వేషాధారణ.. వివాదంలో బీజేపీ సర్కార్