మార్గదర్శి వ్యవస్థాపకుల్లో ఒకరైన జీజే రెడ్డి కుమారుడు యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి చిట్ ఫండ్స్ చీటింగ్ కేస్ నమోదు చేసింది సీఐడీ. దీని మీద రామోజీ, ఆయన కోడలు శైలజా కిరణ్ ఏపీ హైకోర్ట్ లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రావొచ్చని తెలుస్తోంది. అయితే మార్గదర్శి బాధితుడు గాదిరెడ్డి యూరిరెడ్డి, తరపు న్యాయవాది డి.శివరామిరెడ్డి కేసు వివరాలను ఈరోజు తెలిపారు. తామను ఏవిధంగా చీటింగ్ చేశారో యూరిరెడ్డి చెప్పుకొచ్చారు.
గాదిరెడ్డి యూరిరెడ్డి తండ్రి జగన్నాథ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త.రామోజీ రావు మార్గదర్శి ప్రారంభించినప్పుడు జగన్నాథ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. జగన్నాథ రెడ్డి స్వస్థలం గుడివాడ వద్ద జొన్నపాడు. మార్గదర్శిలో జగన్నాథ రెడ్డికి 90 షేర్లు, అంటే 24 వాటాలున్నాయి. జగన్నాథ రెడ్డి 1985లో చనిపోయారు. దాని తర్వాత ఆయన కుటుంబం యురోపియన్ కంట్రీలో సెటిల్ అయ్యారు. అయితే జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి 2014 సాక్షి పత్రికలో వచ్చిన వార్త ద్వారా తనతండ్రి జగన్నాథ రెడ్డికి మార్గదర్శిలో షేర్లు ఉన్నట్టు తెలుసుకున్నారు. దాని తరువాత తమ తండ్రి పేరుపై ఉన్న షేర్లు క్లైమ్ చేసుకోవడానికి ప్రయత్నించారు.మార్గదర్శి ఉద్యోగులను అడిగి తన షేర్లు పొందేందుకు ప్రయత్నించారు. మార్గదర్శిలో షేర్ హోల్డర్లలో మొత్తం 5మంది రామోజీ కుటుంబ సభ్యులు కాగా జగన్నాథ రెడ్డి ఒక్కరే బయటి షేర్ హోల్డర్.
Also Read:సుప్రీంలో చంద్రబాబుకు ఊరట లభించేనా?
1995 నుండి 2016 వరకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న శైలజా కిరణ్ కు 100 షేర్లు మాత్రమే ఉండగా జగన్నాధ్ రెడ్డికి మాత్రం 288 షేర్లు ఉన్నాయి. తనకు తండ్రి షేర్స్ ఇవ్వాలని తిరుగుతున్న క్రమంలోరామోజీ, శైలజా తన చేత పలుచోట్ల సంతకాలు పెట్టించుకున్నారని చెబుతున్నారు యూరిరెడ్డి. తమ ప్రమేయం లేకుండా తన షేర్లు శైలజా కిరణ్ కు బదలాయించారని ఆరోపిస్తున్నారు.అసలు తనకు షేర్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. తనను అయోమయానికి గురిచేసి సంతకాలు పెట్టించుకుని షేర్లు బదలాయించినట్టు యూరిరెడ్డి సీఐడీ కి ఫిర్యాదు చేశారు.
తన పేరు మీద ఏమీ షేర్లు లేవుని యూరిరెడ్డి తెలిపారు.రామోజీ రావుకు మా తండ్రి రూ.5 వేలు డబ్బు ఇచ్చారు.మాకు మార్గదర్శి లో షేర్లు ఉన్నాయని నాకు 1997 నుండి తెలుసు. నేను ఒకసారి రామోజీరావును మా షేర్ల గురించి అడిగితే మీ నాన్న రూ5 వేలు ఇచ్చారు.. నేను తిరిగి ఇచ్చేశాను అని చెప్పారు.పెద్ద మనిషి అయిన రామోజీ కేవలం రూ.5 వేల కోసం అబద్ధం చెప్పారని యూరిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన షేర్లు వారికి బదలాయింపు అయిపోయాయని 2017లో ఆర్వోసీ ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. మొదట తాను మార్గదర్శి మీద పోరాడేందుకు చాలా భయపడ్డానని చెప్పారు యూరిరెడ్డి.