5 States Bandh : మావోయిస్టు సెంట్రల్ రీజినల్ బ్యూరో(Maoists Central Regional Bureau) అధికార ప్రతినిధి ఓ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది 50 మంది మావోయిస్టులు మృతి చెందారని... వారి మృతికి నిరసనగా సోమవారం తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్ గడ్, ఒడిశా, మహారాష్ట్ర(Maharashtra)... వంటి ఐదు రాష్ట్రాలకు బంద్ కు పిలుపునిచ్చినట్లు మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ అనే పేరుతో ఓ లేఖను ఆదివారం విడుదల చేశారు.
ఈ నెల 6న తెలంగాణ(Telangana), చత్తీస్‌గడ్ బార్డర్ లో ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ హత్యలను కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యాకాండలు నరహంతక దాడిగా అభివర్ణించారు.
ఈ హత్యలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కారణమని ఆరోపించిన మావోయిస్టులు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం పిట్టపాడ వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు ఏకపక్ష కాల్పులు జరిపారని ఆరోపించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి ఛత్తీస్గడ్ రాష్ట్రం నుండి కూలీ పనులకు వచ్చిన కూలీలను బెదిరించి కొరియర్లుగా మార్చుకొని వారి సమాచారం తో ముగ్గురు కామ్రేడ్లని ఎన్కౌంటుర్ పేరుతో హత్య చేశారన్న జగన్.
ఈ నెల 6వ తేదీన తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు 5.10 నిమిషాలకు మావోయిస్టులు ఉన్న స్థలాన్ని చుట్టుముట్టి మూకుమూడిగా పోలీసు బలగాలు దాడి చేశాయని ఆరోపించారు.
Also Read : దుండిగల్ లో కారు బీభత్సం..అతి వేగంతో విగ్రహాన్ని ఢీకొట్టి..ఒకరు మృతి!