Chhattisgarh: కంకేర్ ఎన్ కౌంటర్.. అమరుల లిస్ట్ రిలీజ్ చేసిన మావోయిస్టు పార్టీ!

ఛత్తీస్‌గఢ్ కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. నమ్మకద్రోహం కారణంగానే భారీ నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ పోరాటంలో అమరులైన వారి జాబితాను రిలీజ్ చేసింది. వారి వివరాలను ప్రజలకు తెలియజేయాలని మీడియాను కోరింది.

New Update
Chhattisgarh: కంకేర్ ఎన్ కౌంటర్.. అమరుల లిస్ట్ రిలీజ్ చేసిన మావోయిస్టు పార్టీ!

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ కంకేర్ జిల్లా ఛోటే వెటియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నమ్మకద్రోహం కారణంగా భయంకరమైన ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. అయితే ఈ పోరాటంలో అమరులైన వారికి సంబంధించి రకరకాలుగా వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో వీరమరణం పొందిన మృతదేహాల వివరాలు వెల్లడించింది. ఈ మేరకు 'మా ప్రియమైన సహచరుల పేర్లను పంపుతున్నాం. పోలీసుల ఎన్‌కౌంటర్‌ జరిగిన వెంటనే ప్రచారంలో ఉన్న పేర్లు సరైనవి కావు. దీంతో కొడుకులు, కూతుళ్ల విషయంలో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దయచేసి మేము పంపిన పేర్లను మీ ఛానెల్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నాం' అంటూ మీడియాను కోరారు.

అమరవీరుల జాబితా:
1. కామ్రేడ్ శంకర్ DVCM జిల్లా వరంగల్ (జయ శంకర్ భూపాలపల్లి) గ్రామం చల్లగరిగే.
2. బద్రు సౌత్ బస్తర్ కారెగూడెం
3. అనిత ఈస్ట్ బస్తర్ ఖోండోస్
4. వినోద్ మన్పూర్ ప్రాంతం
5. రీటా మన్పూర్ ప్రాంతం
6. రమేష్ ఓయం భైరంగడ్ గ్రామం వెచ్చం
7. బచ్ను గంగలూర్ అవకేం
8. సురేఖ గడ్చిరోలి, మిదండపల్లి
9. కవిత నెందుర్
10. రజిత ఆదిలాబాద్
11. భూమే సౌత్ బస్తర్ విలేజ్ అప్పీల్
12. కార్తిక్ వెస్ట్ బస్తర్ గ్రామం మారుమ్
13. రోషన్ దర్భా డివిజన్
14. దేవల్ గంగలూర్ గ్రామం పిడియా
15. దిను (గుడ్డు) దుర్దా
16. అన్వేష్ సౌత్ బస్తర్ ఉకుర్
17. జనీలా అలియాస్ మోడీ కొవాడి బస్తర్ కొరెంజెడ్
18. సంజిల మడ్కం బస్తర్ కరాకా
19. గీతా తకిలోడు ఇంద్రావతి
20. రాజు కురసం ప్రకేలి
21. షర్మిల ఇంద్రావతి బత్వెడ
22. సునీల ఇంద్రావతి రేకవై
23. శాంతిల నార్త్ బస్తర్ కుమ్డిగుండ
24. పింటో
25. బజ్నాత్ నార్త్ బస్తర్ వాటేకల్
26. శీలా ఇంద్రావతి ఊట్ల
27. జైనీ నార్త్ బస్తర్ చటేకల్

ఇది కూడా చదవండి: IVF: పుట్టకముందే మరణం.. ఇజ్రాయేల్‌ దాడిలో లక్షలాది పిండాలు, అండాలు ఛిద్రం!

ఈ పోరాటలంలో వీరమరణం పొందిన ఇద్దరు సహచరుల వివరాలు అందుబాటులో లేవు. విప్లవాభివందనాలతో రాముని (రాముని హిచామి) రివల్యూషనరీ ట్రైబల్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి.

గమనిక: ఈ ఎన్‌కౌంటర్ గురించి సవివరమైన సమాచారం తర్వాత ఇవ్వబడుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు