Nitya Kalyani flower: నిత్య కల్యాణి పువ్వులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా?..ఎలా ఉపయోగించాలి?

నిత్యకళ్యాణి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ పువ్వును శుభ్రంగా కడిగి నీటిలో మరిగించి తాటి ముంజతో కలిపి తాగితే డిప్రెషన్, మానసిక అలసట వంటి సమస్యలు తీరుతాని నిపుణులు చెబుతున్నారు. ఈ పువ్వు బహిష్టు నొప్పి, పొత్తికడుపు తిమ్మిర్లు తగ్గిస్తుందంటున్నారు.

New Update
Nitya Kalyani flower: నిత్య కల్యాణి పువ్వులో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా?..ఎలా ఉపయోగించాలి?

Nitya Kalyani flower: చాలామంది ఇళ్లలో అందం కోసం నిత్యకళ్యాణి మొక్కలను పెంచుతారు. ఈ పువ్వులు కూడా చూడచక్కగా ఉంటాయి. కొన్నిచోట్ల పెరట్లో కూడా మన ప్రమేయం లేకుండా ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఒక్కో పువ్వుకు ఒక్కో సీజన్ ఉంటుంది. కొన్ని పూలు కొన్ని సీజన్లలో ఎక్కువగా వికసిస్తాయి. ఈ మొక్క వేడిని తట్టుకుంటుంది. ఈ పువ్వు అన్ని కాలాల్లో సమానంగా వికసిస్తుంది. అందుకే దీన్ని నిత్య కళ్యాణి అంటారు. ఈ పువ్వు గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఒత్తిడి, డిప్రెషన్ నుంచి ఉపశమనం:

  • నిత్య కల్యాణి పువ్వులో మానసిక ఆరోగ్యాన్ని పెంచే గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ పువ్వును శుభ్రంగా కడిగి నీటిలో మరిగించి తాటి ముంజతో కలిపి తాగితే డిప్రెషన్, మానసిక అలసట వంటి సమస్యలు తీరుతాని చెబుతున్నారు.

జ్వరాన్ని తగ్గిస్తుంది:

  • నిత్యం కల్యాణి పుష్పానికి కడుపునొప్పి, జలుబును తక్షణమే నయం చేసే శక్తి ఉంది. గుప్పెడు నిత్యకళ్యాణి ఆకులను వాటి కాండంతో పాటు కడిగి శుభ్రం చేసి నీళ్లలో వేసి బాగా మరిగించి ఆ తర్వాత ఉదయం, సాయంత్రం రెండుసార్లు తాగితే జ్వరం మాయం అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మధుమేహాన్ని నియంత్రిస్తుంది:

  • కల్యాణి పువ్వు డయాబెటిక్ పేషెంట్లకు ఔషధమని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది బ్లడ్ షుగర్‌ని అదుపులో ఉంచడమే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులలో అనారోగ్య సమస్యలకు కూడా అద్భుతమైన ఔషధమని నిపుణులు అంటున్నారు. దీని ఆకులను, పువ్వులను తీసుకుని శుభ్రం చేసి నీటిలో మరిగించి జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలను మెత్తగా నూరి కషాయంగా తాగితే మధుమేహం అదుపులోకి వస్తుందని చెబుతున్నారు.

బహిష్టు నొప్పిని తగ్గిస్తుంది:

  • పీరియడ్స్ సమయంలో మహిళలు అనుభవించే అసౌకర్యాన్ని తగ్గించడంలో నిత్యకల్యాణి చాలా బాగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. బహిష్టు నొప్పి, పొత్తికడుపు తిమ్మిర్లు తగ్గిస్తుంది. అంతేకాకుండా క్రమరహిత పీరియడ్స్‌ని నియంత్రిస్తుంది.

ఆస్తమా అదుపులోకి వస్తుంది:

  • ఆస్తమా వ్యాధిగ్రస్తులకు నిత్య కళ్యాణి ఒక అద్భుతమైన ఔషధంగా చెబుతున్నారు. ఇది ఆస్తమా వల్ల వచ్చే శ్వాస ఆడకపోవడాన్ని నియంత్రిస్తుంది. నిత్యకళ్యాణి ఆకులను, పువ్వులను కడిగి నీళ్లు పోసి వేడిచేసి తేనె కలిపి తాగితే ఉబ్బసం అదుపులోకి వస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి : పిల్లలకు ఏ వయసు నుంచి టీ తాగించాలి?..లేకపోతే ప్రాణాలకే ప్రమాదమా?

గమనిక :ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు