Massage: మగవారికి మసాజ్ వల్ల కలిగే లాభాలు..ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి మసాజ్ చేయడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందడంతోపాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. నరాల నియంత్రణ, మెదడు పనితీరును పెంచడంలో మసాజ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మంచి ఆయిల్ మసాజ్ పురుషులు, మహిళలు ఇద్దరికీ అవసరమని చెబుతున్నారు. By Vijaya Nimma 15 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Massage: శరీరానికి మసాజ్ చేయడం చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా అవసరం. బాడీ మసాజ్ పురుషులు, మహిళలు ఇద్దరికీ అవసరం. పురుషులకు ఎక్కువ శరీర మసాజ్ అవసరమని థెరపిస్టులు సూచిస్తున్నారు. కనీసం నెలకు ఒకసారి పూర్తి శరీర మసాజ్ చేయడం చాలా ముఖ్యం. శరీరానికి మసాజ్ చేయడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం పొందడంతోపాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఆందోళనను తగ్గిస్తుంది: ఎక్కువ వ్యాయామం చేసే వ్యక్తులు ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తారు. కండరాలు కూడా అలసిపోతాయి. మసాజ్ కండరాలను సడలించడానికి, బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. నరాల నియంత్రణ, మెదడు పనితీరును పెంచడంలో మసాజ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిలో సానుకూల ఆరోగ్య మార్పులను తీసుకొస్తుంది. తెల్లజుట్టు నల్లగా మారుతుందా? బాడీ మసాజ్ చేయడం వల్ల గ్రే హెయిర్ నల్లగా అవుతుందా..అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మసాజ్ చేయడం వల్ల తలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు తెల్ల జుట్టు కూడా నల్లగా అవుతుందని నిపుణులు అంటున్నారు. తిమ్మిర్లు దూరమవుతాయి: ఆఫీసులో గంటల తరబడి ఒకే చోట కూర్చుని గడిపితే కండరాలు అలసిపోతాయి. కొన్ని రకాల నొప్పులు, నరాల నొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి. మసాజ్ వీటిని సరిచేయడానికి, శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: గోరువెచ్చని నూనెను చర్మానికి రాసి బాగా మసాజ్ చేయడం వల్ల చర్మం పొడిబారడం తొలగిపోయి ముఖం నుంచి అరికాళ్ల వరకు చర్మం బాగా తేమగా ఉంటుంది. మంచి నిద్ర: మంచి ఆయిల్ మసాజ్ చేశాక గోరువెచ్చని స్నానం చేసి బెడ్‌పై పడుకుంటే నిద్ర బాగా వస్తుంది. ఎందుకంటే నూనెతో బాగా మసాజ్ చేస్తే శరీరమంతా కండరాలు టెన్షన్ తగ్గి రిలాక్స్‌గా ఉంటాయి. దీంతో నిద్ర కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా వెన్నునొప్పి కూడా తగ్గుంది. ఇది కూడా చదవండి: నోటి క్యాన్సర్‌ను నివారించే మార్గాలు..వెంటనే పరిష్కారం గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #men #baby-health-care #massage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి