Manushi Chhillar: నాకు రష్మిక లాంటి పాత్ర పోషించాలనుంది.. మిస్ వరల్డ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

'యానిమల్'మూవీలో రష్మిక పోషించిన పాత్రపై మిస్ వరల్డ్, నటి మానుషి చిల్లర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. భర్త ఎలా ఉన్నా.. ఒక బాధ్యత గల భార్యగా గొప్పగా నటించింది. రష్మిక యాక్టింగ్ సూపర్. నాకు ఇలాంటి సవాలు చేసే పాత్రల్లో నటించాలనుందంటూ చెప్పుకొచ్చింది.

New Update
Manushi Chhillar: నాకు రష్మిక లాంటి పాత్ర పోషించాలనుంది.. మిస్ వరల్డ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Manushi : మిస్ వరల్డ్, నటి మానుషి చిల్లర్ 'యానిమల్'పై ప్రశంసలు కురిపించిది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీలో రణ్ బీర్, రష్మిక, త్రిప్తి డిమ్రిలు ప్రధాన పాత్రల్లో నటించగా విమర్శలతోపాటు ప్రశంసలు కూడా అందుకుంది ఈ మూవీ. అయితే రీసెంట్ గా వరుస సినిమాలు చేస్తున్న మానుషి.. ప్రస్తుతం ‘బడే మియాన్ ఛోటే మియాన్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాధ్యత గల భార్యగా..
ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటి.. ‘యానిమల్’ మూవీ తనకు బాగా నచ్చిందని చెప్పింది. ‘నాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో నటించాలని ఆశగా ఉంది. 'యానిమల్’ సినిమాలో రష్మిక, త్రిప్తిల పాత్రలు చాలా బాగున్నాయి. ఆసక్తికరంగా అనిపించాయి. నాకు రష్మిక పాత్రలో నటించాలని ఉంది. భర్త ఎలా ఉన్న ఒక బాధ్యత గల భార్యగా ఆమె అతని కోసం నిలబడటం ఆదర్శంగా అనిపించింది. ధైర్యంగా ఉండగలిగింది. రష్మిక యాక్టింగ్ సూపర్. నాకు ఇలాంటి సవాలు చేసే పాత్రల్లో నటించాలనుంది' అంటూ తన మనసులో మాట బయటపెట్టింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు