Paris Olympics: అంతా నీ వల్లే అమ్మా..మను బాకర్ ఒలింపిక్స్‌లో మను బాకర్ హ్యాట్రిక్ పతకాల కోసం పెట్టిన గురి తృటిలో తప్పిపోయింది. దీంతో మను కాస్త భావోద్వేగానికి లోనయ్యింది. మూడోది రానందకు కాస్త బాధగా ఉన్నా..ఇప్పటివరకు సాధించిన దానికి తృప్తిగా ఉందని చెప్పింది. దీనంతటికీ కారణం తన అమ్మే అని..ఆమెకు ధాంక్యూ అని చెప్పింది. By Manogna alamuru 03 Aug 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Manu Bakar: ఒలిపింక్స్ మహిళ సింగిల్స్ పిస్టల్ విభాగంలో మను బాకర్ చరిత్ర సృష్టించందనే చెప్పాలి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం.. ఆ తర్వాత మిక్సడ్ డబుల్స్‌లో మరో షూటర్ సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మరో కాంస్యం తన ఖాతాలో వేసుకుంది. 25 మీటర్ల రైఫిల్ విభాగంలో కా పతకం వ్తుంది మనుబాకర్ చరిత్ర సృష్టిస్తుంది అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో గురి తప్పింది. ఈ ఈవెంట్లో 4వ స్థానంతో మను సరిపెట్టుకుంది. కానీ ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా మను రికార్డులకెక్కింది. మూడో పతకం చేజారిన తర్వాత ఒలింపిక్ ఇండియా అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో సినిమాతో మాట్లాడిన మను భాకర్ భావోద్వేగానికి లోనయ్యంది. తన తల్లి సహకారంతోనే ఇదంతా సాధించానని మను తెలిపింది. అందుకే అమ్మకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాని అంది. నా కోసం అన్నింటిని త్యాగం చేసిన అమ్మకు ధన్యవాదాలు. నీ సహకారంతో ఈ స్థాయికి చేరుకోగలిగాను. నేను నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను.నువ్వు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతూ దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. నీవు వీలైనంత ఎక్కువ కాలం నాతో పాటే ఉండాలని నేను ఆశిస్తున్నా అంటూ తన అమ్మకు మను సందేశం పంపింది. Also Read:Paris Olympics: సాత్విక్ – చిరాగ్ ఓటమి.. నటి తాప్సీ భర్త సంచలన నిర్ణయం! #mother #manu-bakar #2024-paris-olympics #special-thanks మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి