Paris Olympics: సాత్విక్‌ - చిరాగ్‌ ఓటమి.. నటి తాప్సీ భర్త సంచలన నిర్ణయం!

పారిస్ ఒలింపిక్స్‌లో స్టార్‌ షట్లర్‌ సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ఓటమితో కోచ్ మథియాస్‌ బో సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. కోచింగ్‌ బాధ్యతలకు వీడ్కోలు పలుకుతూ 'ఇక అలసిపోయా. ఈ అవకాశం ఇచ్చిన భారత బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌కు ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

New Update
Paris Olympics: సాత్విక్‌ - చిరాగ్‌ ఓటమి.. నటి తాప్సీ భర్త సంచలన నిర్ణయం!

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో భారత్‌కు తొలి డబుల్స్‌ పతకాన్ని అందిస్తారని ఆశించిన స్టార్‌ షట్లర్‌ జోడీ సాత్విక్‌-చిరాగ్‌ ఓటమి పాలై విషయం తెలిసిందే. కాగా ఈ ఓటమితో కోచ్ మథియాస్‌ బో సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఓటమితో తాను కోచ్‌ బాధ్యతలను వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

View this post on Instagram

A post shared by Mathias Boe (@mathias.boe)

ఈ మేరకు పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో ఈ జోడీ అనూహ్య రీతిలో ఓటమిపాలై విశ్వ క్రీడల నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో వీరికి కోచింగ్‌ ఇచ్చిన ప్రముఖ కోచ్‌, నటి తాప్సీ భర్త మథియాస్‌ బో కోచింగ్‌ బాధ్యతలకు వీడ్కోలు పలుకుతూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘నా కోచింగ్‌ రోజులు ముగిశాయి. ఇక ప్రపంచంలో ఎక్కడా బాధ్యతలు నిర్వర్తించను. నా జీవితంలో సుదీర్ఘ సమయాన్ని బ్యాడ్మింటన్‌ హాల్‌లో వెచ్చించాను. కోచ్‌ బాధ్యత కొంత ఒత్తిడితో కూడినదే. ఇక అలసిపోయా. ఈ అవకాశం ఇచ్చిన భారత బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌కు ధన్యవాదాలు. ఇక్కడ ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి' అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. ఇక 2024 మార్చిలో నటి తాప్సీ (Taapsee Pannu)ని మథియాస్‌ బో పెళ్లి చేసుకున్నాడు.

Also Read : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్కడి భారతీయులు ఎవరివైపు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు