Manmohan Singh: ముగిసిన 33 ఏళ్ల రాజకీయ ప్రయాణం.. ఇక నుంచి ఆ సీట్లో!

ఆర్థిక వ్యవస్థలో అనేక సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పదవీ కాలం బుధవారంతో ముగుస్తోంది. దాదాపు 33 సంవత్సరాల పాటు కొనసాగిన ఆయన రాజకీయ జీవితానికి బుధవారంతో స్వస్తి పలకనున్నారు.

New Update
RK Singh's shocking comments: మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలను సోనియాగాంధీ మార్చేవారు..యూపీఎ సర్కార్ పై ఆర్కే సింగ్ షాకింగ్ కామెంట్స్..!

Manmohan Singh: ఆర్థిక వ్యవస్థలో అనేక సాహసోపేతమైన సంస్కరణలకు మన్మోహన్ సింగ్ (Manmohan Singh) నాంది పలికిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పదవీ కాలం బుధవారంతో ముగుస్తోంది. దాదాపు 33 సంవత్సరాల పాటు కొనసాగిన ఆయన రాజకీయ జీవితానికి బుధవారంతో ఆయన స్వస్తి పలకనున్నారు. 1991 అక్టోబర్‌లో తొలిసారిగా సభలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక 1991 నుంచి 1996 వరకు పీవీ.నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. అనంతరం 2004 నుంచి 2014 వరకు.. అనగా 10 ఏళ్ల పాటు భారత ప్రధానమంత్రిగా సేవలందించారు.

1991, అక్టోబర్‌లో రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ సింగ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. పలికారు. కాంగ్రెస్‌కు వీరవిధేయుడిగా పేరు సంపాదించారు.91 ఏళ్ల మన్మోహన్ సింగ్ పదవీకాలం ఏప్రిల్ 3న పూర్తికావడంతో ఖాళీగా ఉన్న సీటును సోనియా గాంధీ (Sonia Gandhi) భర్తీ చేస్తున్నారు. తొలిసారిగా ఆమె రాజస్థాన్ నుంచి ఎగువసభలో అడుగుపెడుతున్నారు.

బుధవారం నాడు మన్మోహన్‌తో పాటు మరో ఏడుగురు కేంద్ర మంత్రులు కూడా పదవీ విరమణ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య , పశుసంవర్ధక , మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ కి కూడా నిన్నటితో రాజ్యసభలో పదవీకాలం ముగిసింది.

ఇక, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ల పదవీ కాలం బుధవారంతో ముగియనుంది. ఈ కేంద్రమంత్రులందరూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అశ్విని వైష్ణవ్, మురుగన్‌లకు మరోసారి రాజ్యసభ పదవి లభించింది. రాజ్యసభ నుంచి ఏప్రిల్‌ 2 49 మంది సభ్యులు పదవీ విరమణ చేయగా.. మరో ఐదుగురు ఏప్రిల్‌ 3న పదవీ విరమణ చేస్తున్నారు.

Also read: చిన్న వయసులోనే ముసలి వారిలా కనిపిస్తున్నారా..అయితే బీ 12 లోపం కావొచ్చు!

Advertisment
Advertisment
తాజా కథనాలు