గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న తన భార్యను కలవాలని...దానికి అనుమతినివ్వాలని ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భార్యను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలో కలవాలని సిసోడియా పిటిషన్ లో కోరారు.
ఈ ఏడాది జూన్ లో సిసోడియా ఆయన భార్యను అధికారుల సమక్షంలో కలిసేందుకు అనుమతినిచ్చింది. ఆ తరువాత ఆయన తన భార్యను కలవనే లేదు. అక్టోబర్ లో మనీష్ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన అనంతరం కోర్టు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని నవంబర్ 22 వరకు పొడిగించింది.
అయితే ఈ క్రమంలో సిసోడియా బెయిల్ పిటిషన్ ను అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు రెండు కూడా తిరస్కరించాయి. దీంతో ఆయన సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాని గురించి రెండు నెలలుగా విచారణ కొనసాగుతుంది.దీంతో బెయిల్ పిటిషన్ ను ఈడీ, సీబీఐలు కూడా సుప్రీం కోర్టులో వ్యతిరేకించాయి.
ఈడీ వాదనలు విన్న తరువాత ఆప్ లాభపడి ఉంటే..ఆప్ ను ఎందుకు నిందితుడిగా చేర్చలేదని సుప్రీం ప్రశ్నించింది. సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత మనీలాండరింగ్ కేసులో ఆప్ ను కూడా నిందితునిగా మార్చాలని ఈడీ చూస్తుంది. ఒకవేళ ఆప్ ను నిందితునిగా చేర్చినట్లయితే..ఆ పార్టీ నాయకత్వం..సంస్థ రెండింటి పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అందరూ అనుకుంటున్నారు.
సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తరువాత మార్చి 9న తీహార్ జైలు నుంచి ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సిసోడియా రెండు కేసుల్లో తీహార్ జైలులో ఉన్నారు. ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఇప్పటివరకు చాలా మంది నిందితులకు బెయిల్ మంజూరైంది. అయితే మనీష్ సిసోడియాకు ఇంకా బెయిల్ రాలేదు.
Also read: ఖతార్ లో నేవీ అధికారులకు మరణశిక్ష.. అప్పీల్ చేసిన భారత్!