Manda Krishna Madiga Comments On Congress: కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. కేంద్రంలో అధికారంలో అధికారంలో మరోసారి బీజేపీ (BJP) రావాలని అన్నారు. బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజినామా చేసి బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ (BB Patil) తో ఆయన సమావేశం అయ్యారు.
ALSO READ: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప!
బీబీ పాటిల్ ను గెలిపించాలి..
జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా దళితుల రిజర్వేషన్ కోసం ఎమ్మార్పీఎస్ వేదికగా అనేక ఉద్యమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ (SC Classification) విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, ఎస్సీ వర్గీకరణ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన హామీ ఇచ్చారని, బీజేపీ తోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని తెలిపారు. జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు దళిత బలహీన వర్గాల సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు.
బీబీ పాటిల్ కు అడ్డంకులు..
బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ను పార్టీలో చేర్చుకోవడం బీజేపీకి ఇప్పుడు తలనొప్పిగా మారింది. పాటిల్ ను బీజేపీలో చేర్చుకోవద్దంటూ జహీరాబాద్ బీజేపీ నేతలు ఇటీవల హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎదుట ఆందోళనకు దిగారు. ఫెయిల్యూర్ ఎంపీ మాకొద్దు అంటూ నినాదాలు చేపట్టారు. అతనికి ఎంపీ టికెట్ ఇస్తే బీజేపీ మూడో స్థానంలో పడిపోతుందని వారు ఆందోళన చేపట్టారు. బీబీ పాటిల్ కాకుండా జహీరాబాద్ లో పార్టీని బలోపేతం చేసిన జైపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేసినా కూడా బీబీ పాటిల్ కు ఎంపీ టికెట్ కేటాయించింది బీజేపీ హైకమాండ్. ప్రస్తుత అక్కడి బీజేపీ నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు తెలంగాణ బీజేపీ పెద్దలు. మరి రానున్న లోక్ సభ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ గెలుస్తారా? లేదా?అనేది ఎన్నికల ఫలితాల రోజు తెలియనుంది.