Movies:యోధుడిగా భక్త కన్నప్ప..ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్.

మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్ప. పీరియాడిక్ మైథలాజికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విష్ణు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటీ అనే మూవీ క్యాప్షన్ కు తగ్గట్టే ఫస్ట్ లుక్ అట్రాక్టివ్ గా ఉంది.

Kannappa Movie : మహాశివరాత్రి రోజు అదిరిపోయే అప్డేట్‌ తో రాబోతున్న కన్నప్ప టీం!
New Update

హాలీవుడ్ స్థాయిలో కన్నప్ప సినిమా తీయాలని ఉంది అనే ఎప్పటినుంచో చెబుతున్న మంచు విష్ను ఎట్టకేలక తన కలను సాకారం చేసుకుంటున్నాడు. దీనికి సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని తెరకెక్కడానిక ఇసిద్ధం అయింది. ఈ సినిమాకు కథ కూడా మంచు విష్ణే స్వయంగా అందించాడు. కన్నప్పలో 80 శాతం సన్నివేశాలను న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాలలో తీస్తామని సినిమా యూనిట్ ఇంతకు ముందే అనౌన్స్ చేసింది. ప్రస్తుతం విష్ణు మంచు కూడా అక్కడే ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ చూస్తే... కన్నప్పను యోధుడిగా, అపర భక్తుడిగా చూపిస్తున్నారని అర్థం అవుతోంది.

Also Read:యుద్ధానికి నాలుగురోజులు విరామం..ఇజ్రాయెల్‌–హమాస్‌ ఒప్పందం

న్యూజిలాండ్ దేశంలోని ప్రకృతి, ఆ వాతావరణం, అందమైన ప్రదేశాలను మా సినిమాలో చాలా అద్భుతంగా చూపించబోతున్నాం. మైథాలజీ నేపథ్యంలో సన్నివేశాలకు న్యూజిలాండ్ వాతావరణం సరిగ్గా సరిపోతుందని చెబుతున్నారు మంచు విష్ణు.హాలీవుడ్ క్లాసిక్ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ ఫ్రాంచైజీ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ షూటింగ్ జరిగిన ప్రదేశాలలో కన్నప్ప చిత్రీకరణ చేస్తున్నారు. అంతకు ముందు కన్నప్ప భక్తికి గుర్తు అయిన శ్రీకాళహస్తి గుడిలో మూవీని పూజా కార్యక్రమాలతో ప్రాంభించారు.

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కన్నప్ప సినిమాలో శివ పార్వతుల పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సైతం ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే, మోహన్ బాబు, శరత్ కుమార్ కూడా ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. హిందీ పరిశ్రమ నుంచి కూడా కొంత మంది ఇందులో యాక్ట్ చేస్తారని చెబుతున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్, విష్ణు తండ్రి మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్టార్ ప్లస్ టీవీలో మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్పకు దర్శకుడు. సుమారు రూ. 150 కోట్ల నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందనుంది. ఇక ఈ మూవీకి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా సంగీతాన్ని అందించనున్నారు.

#telugu #first-look #kannappa #movies #manch-vishnu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe