Manchu Vishnu : థియేటర్స్ లో 'కన్నప్ప' టీజర్.. కేవలం వాళ్లకు మాత్రమే!

మంచు విష్ణు 'కన్నప్ప' టీజర్ గురించి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఇండియాలో ఉన్న ఆడియన్స్ కోసం జూన్ 13 న టీజర్ రిలీజ్ చేస్తున్నాం. మే 30 న సినిమాను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్న వారికోసం హైదరాబాద్ లోని పలు థియేటర్స్ లోస్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నాం అని తెలిపాడు

New Update
Manchu Vishnu : థియేటర్స్ లో 'కన్నప్ప' టీజర్.. కేవలం వాళ్లకు మాత్రమే!

Manchu Vishnu Update On Kannappa Teaser :మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్ లో నటిస్తున్న కన్నప్ప టీజర్ ను నిన్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes Film Festival) లో ప్రదర్శించారు. ఈ ఫిలిం ఫెస్టివల్ లో టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ పై మంచు విష్ణు తన సోషల్ మీడియా (Social Media) వేదికగా పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా టీజర్ రిలీజ్ డేట్ కూడా రివీల్ చేశాడు.

థియేటర్స్ లో 'కన్నప్ప' టీజర్

మంచు విష్ణు తన ట్విట్టర్ లో.. " కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప టీజర్ ప్రదర్శించాం. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. టీజర్ కి ఇంత గొప్ప రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో ఉన్న ఆడియన్స్ కోసం జూన్ 13 న టీజర్ రిలీజ్ చేస్తున్నాం.

Also Read : ఫ్యామిలీ స్టార్’ పై వాళ్ళు కావాలనే దుష్ప్రచారం చేశారు.. అందుకే సైబర్ క్రైం కంప్లైంట్ ఇచ్చాం : ఆనంద్ దేవరకొండ

అంతకంటే ముందు మే 30 న సినిమాను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్న వారికోసం స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నాం. హైదరాబాద్ (Hyderabad) లోని పలు థియేటర్స్ లో టీజర్ ని ప్రదర్శించనున్నాం. ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభమైనప్పటినుంచి సోషల్ మీడియాలో నిరంతరం మెసేజ్‌లు చేస్తూ.. ప్రోత్సహిస్తున్న వారిని త్వరలోనే మా టీమ్‌ సంప్రదిస్తుంది" అంటూ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ దిగిన ఫోటోలను షేర్ చేశాడు. దీంతో మంచు విష్ణు చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisment
తాజా కథనాలు