Ustad Show: మంచు వారి అబ్బాయి షోకి ఈసారి మెగా మేనల్లుడా..? మంచు మనోజ్ హోస్ట్ చేస్తున్న ఉస్తాద్ గేమ్ షోకి ఈసారి ఏ హీరో రాబోతున్నాడంటూ..మేకర్స్ మరోసారి అభిమానులకు పజిల్ పెట్టారు. కొందరు మెగా కంపౌడ్ మేనల్లుడు అంటుంటే..మరికొందరు ఈగల్ హీరో రవితేజ అంటున్నారు. By Bhavana 01 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ (Manchu Manoj) కొత్తగా హోస్ట్ చేస్తున్న గేమ్ షో ఉస్తాద్ (Ustad) గురించి అందరికీ తెలిసిందే. ఈటీవీ విన్ లో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ గేమ్ షో ఇప్పటికే అభిమానుల్లో దూసుకుపోతుంది. షోకి వస్తున్న గెస్ట్ లతో మనోజ్ ఓ ఆట ఆడేసుకుంటున్నాడనే చెప్పవచ్చు. ఈ షోకి ప్రస్తుతానికి పెద్ద స్టార్లే వచ్చారు. నానితో(Nani) ఈ ఆట మొదలవ్వగా..ఆ తరువాత సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) , రానా (Rana)వచ్చి అల్లరి చేశారు.ఇప్పుడు మరో కొత్త గెస్ట్ ఈ షోకి వచ్చి సందడి చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ ఫోటోను విడుదల చేశారు. అందులో మనోజ్ ను గట్టిగా హత్తుకున్న ఓ సెలబ్రిటీని హత్తుకున్న ఫోటోను విడుదల చేశారు. ఈసారి కూడా గెస్ ది హీరో అంటూ మరోసారి అభిమానుల మెదడుకు పదును పెట్టారు. ఈ ఫోటోలో కనీసం హీరో ముఖం మచ్చుకు కూడా చూపించలేదు. అయితే అభిమానులు మాత్రం అతని జుట్టు, బాడీ లాంగ్వేజ్ ను బట్టి అతను మెగా కంపౌడ్ నుంచి వచ్చిన హీరో అని చెప్పేస్తున్నారు. దీంతో అతను సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) అని కొందరు అంటుంటే...మరి కొందరు మాత్రం అతను రవితేజ (Ravi Teja) అని చెప్పుకోస్తున్నారు. ఈ సంక్రాంతి కానుకగా రవితేజ నటించిన ఈగల్ సినిమా రాబోతుంది. ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న వారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారే. ఈ షో రన్ చేసేది కూడా వారే కావడంతో వారు ప్రమోషన్స్ లో భాగంగా రవితేజని తీసుకుని వచ్చినట్లు కొందరు భావిస్తున్నారు. అయితే వచ్చింది రవి కాదని..రవికి చాలా జుట్టు ఉంటుందని, మనోజ్ కంటే కూడా ఎత్తుగా ఉంటాడని మరికొందరు చెప్పుకొస్తున్నారు. సాయి మనోజ్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్ కావడంతో కచ్చితంగా ఈ ఫోటోలో ఉన్నది తేజ్ నే అని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్ గెస్ట్ ఎవరు అనేది తెలియాలంటే మాత్రం ప్రోమో కోసం వేచి ఉండాల్సిందే. Also read: iPhone16తో పాటు ఈ ఏడాది విడుదల కానున్న దుమ్ములేపే స్మార్ట్‌ఫోన్లు ఇవే! #manchu-manoj #nani #raviteja #ustad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి