Arepalli Mohan: బీజేపీలోకి ఆరెపల్లి మోహన్.. ఘనంగా స్వాగత కార్యక్రమాలు

రేపు ఆరెపల్లి మోహన్ బీజేపీలో చేరికకు సర్వం సిద్ధమైయింది. ఆరెపల్లి తోపాటు జడ్పీటీసీ, ఎంపీటీసీలు సహా పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు చేరే అవకాశం ఉంది. ఎల్లుండి ఘనంగా మానకొండూరులో స్వాగత కార్యక్రమాలకు ఆరెపల్లి అనుచరులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ను ఆరెపల్లి మోహన్ కలిశారు.

Arepalli Mohan: బీజేపీలోకి ఆరెపల్లి మోహన్.. ఘనంగా స్వాగత కార్యక్రమాలు
New Update

మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ ఆరెపల్లి మోహన్ రేపు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రేపు సాయంత్రం 5 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, జాయినింగ్స్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఆరెపల్లి మోహన్‌ తోపాటు బీఆర్ఎస్‌కు చెందిన స్థానిక జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌ల తోపాటు సుమారు 100 మంది ప్రజా ప్రతినిధులు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఏళ్ల తరబడి పనిచేస్తున్న నాయకులు

ఈ నేపథ్యంలో తన అనుచరులతో కలిసి ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి వచ్చిన ఆరెపల్లి మోహన్ బండి సంజయ్‌ను కలిశారు. దాదాపు అరగంటపాటు సంజయ్‌తో భేటీ అయిన ఆరెపల్లి మోహన్ తనతో పాటు పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పార్టీలో అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు. మానకొండురు సహా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గెలుపే లక్ష్యంగా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. అందులో భాగంగా సర్వే నివేదికలను ఆధారంగా చేసుకుని అధిష్టానం టిక్కెట్లు ఇస్తుందన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలున్నారని, వారందరిని కలుపుకుని పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

భారీ ఎత్తున స్వాగత సత్కార సభ

అనంతరం ఆరెపల్లి మోహన్ మానకొండూరు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలతోపాటు మండలాధ్యక్షులకు, జిల్లా నేతలకు ఫోన్లు చేసి బీజేపీలో తాను చేరుతున్న కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. మరోవైపు ఆరెపల్లి మోహన్ అనుచరులు రెండ్రోజుల్లో మానకొండూరుకు ఆహ్వానించి భారీ ఎత్తున స్వాగత సత్కార సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆరెపల్లి మోహన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా 2009లో మానకొండూర్‌ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌ స్థానాల్లో కొందరిని మారుస్తారని ఆరెపల్లి మోహన్‌ తనకు మానకొండూర్‌ నుంచి కాదని చొప్పదండి నుంచి గానీ టికెట్ లభిస్తుందని ఆరెపల్లి మోహన్‌ ఆశించారు. రెపల్లి మోహన్‌కు మానకొండూర్‌ నుంచి బీజేపీ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకే టిక్కెట్ అంటున్న బండి సంజయ్. పాత, కొత్త నేతలను కలుపుకోవాలని కొందరూ సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: శ్రీనివాస్ గౌడ్ ఏ కార్డు ప్లే చేసినా.. ఓడిస్తా: యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

#tomorrow #manakondur #bandi-sanjay #bjp #karimnagar-mp-office #join-arepalli-mohan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe