మూగజీవాల పట్ల కొంతమంది వ్యక్తులు తమ రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి.. కుక్కపిల్లను నేలకేసి దారణంగా కొట్టి చంపిన ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపింది. గుణ అనే జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఈ దృశ్యం ఎంతో భయంగా ఉంది. మూగజీవి పట్ల ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరు ఆందోళనకరంగా ఉంది. అతిడికి శిక్ష పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌క ట్యాగ్ చేశారు. అయితే ఈ వీడియోపై సీఎం కూడా స్పందించారు. ఇలాంటి భయంకరమైన ఘటన చూసి ఆందోళన చెందానని.. ఇలాంటి చర్యలను సహించకూడదని.. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చివరికి పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: కరీంనగర్ పార్లమెంట్ పై ‘బండి’ గురి.. రోడ్ మ్యాప్ రెడీ!
వీడియోను గమనిస్తే ఓ వ్యక్తి దుకాణం ముందు కూర్చొని ఉన్నాడు. ఆ సమయమలో రెండు కుక్క పిల్లలు అతడి వద్దకు వచ్చాయి. వాటిని చూసి విసుగు చెందిన ఆ నిందితుడు ఓ కుక్క పిల్లను బలంగా నేలకేసి కొట్టడంతో అది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో చూసిన నెటీజన్లు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్