అగ్గిపుల్ల ఇవ్వలేదని వాచ్‌మెన్‌పై యువకుడి దాడి.. తల పగిలేల కొట్టి

అగ్గిపుల్ల ఇవ్వలేదనే కోపంలో 22 ఏళ్ల యువకుడు 53 ఏళ్ల వాచ్‌మెన్‌ను కొట్టి చంపిన దారుణం ముంబైలోని బేలాపూర్ రోడ్‌లో జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 1:45 గంటలకు ప్రసాద్ భానుసింగ్ ఖడ్కా తలపై పెద్ద రాయితో దాడి చేసి చంపిన షేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
అగ్గిపుల్ల ఇవ్వలేదని వాచ్‌మెన్‌పై యువకుడి దాడి.. తల పగిలేల కొట్టి

Man Kills Watchmen : ఈ మధ్యకాలంలో మనుషుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది. మృత్యువు ఎప్పుడు, ఎక్కడినుంచి, ఏ రూపంలో తరముకొస్తుందో ఊహించలేకపోతున్నాం. రోడ్డు ప్రమాదాలు(Road Accident), వాతావరణ విపత్తులే కాదు మనుషుల రూపంలోనూ ప్రమాదం పొంచివుంటుంది. తమ ప్రమోయం లేకుండానే దుండగుల చేతిలో అమాయక ప్రజలు ప్రాణాలు కొల్పోతున్నారు. బంగారం, డబ్బులు తదితర చిన్న చిన్న అవసరాల కోసం క్షణికావేశంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న ఘటనలు చాలానే చూశాం. కానీ తాజాగా అగ్గిపుల్ల కోసం ఓ వృద్ధుడు ప్రాణాలు కొల్పోయిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది.

Also read : రేవంత్‌ కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీ.. పోటీపడుతున్న 15 మంది

ముంబై పోలీసుల కథనం ప్రకారం.. బేలాపూర్(Belapur) రోడ్‌లోని రిక్షా స్టాండ్ వద్ద ఓ కంపెనీలో బాధితుడు 53 ఏళ్ల ప్రసాద్ భానుసింగ్ ఖడ్కా అనే వ్యక్తి వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే శుక్రవారం రాత్రి 1:45 గంటల ప్రాంతంలో అటువైపుగా వచ్చిన 22 ఏళ్ల మహ్మద్ ఆదిల్ అజమాలి షేక్ అనే యువకుడు.. భానుసింగ్ దగ్గరకు వచ్చి అగ్గిపుల్ల కావాలని అడిగాడు. ఈ క్రమంలో భానుసింగ్ తనవద్ద లేదని, ఉన్నా ఇవ్వనని నిరాకరించడంతో షేక్ తీవ్ర కోపంతో ఊగిపోయాడు. దీంతో పక్కనే ఉన్న పెద్ద రాయితో భానుసింగ్ పై దాడి చేశాడు. తలపై తీవ్ర గాయలవడంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సాయంతో విషయం తెలుసకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇక నిందితుడు షేక్ ను వెంటనే అరెస్టు చేసి, అతనిపై ఇండియన్ పీనల్ కోస్ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు