అంబులెన్స్‌ లేక కూరగాయల బండి పై ఆసుపత్రికి..సిగ్గుచేటంటున్న ప్రతిపక్షాలు!

సమయానికి అంబులెన్స్‌ రాకపోవడంతో ఉత్తర్ ప్రదేశ్ లో ఓ మహిళను కూరగాయల (తోపుడు) బండి మీద ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రతిపక్షాలు యోగి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నాయి.

New Update
అంబులెన్స్‌ లేక కూరగాయల బండి పై ఆసుపత్రికి..సిగ్గుచేటంటున్న ప్రతిపక్షాలు!

దేశం ఎంతగా ముందుకు వెళ్తున్నప్పటికీ ఇంకా కొన్ని సందర్భాల్లో మాత్రం ఎంత వెనకబడిందో అనిపిస్తుంది. అలాంటి ఘటనే ఒకటి తాజాగా ఉత్తరప్రదేశ్‌ లో చోటు చేసుకుంది. ఓ మహిళ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా..అంబులెన్స్‌ కు ఫోన్‌ చేయగా ఎవరూ స్పందించలేదు.

దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను కూరగాయల(తోపుడు) బండి పై ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఉత్తర్‌ ప్రదేశ్ ఆరోగ్య శాఖ పని తీరు మీద తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. యోగీ ప్రభుత్వాన్ని ప్రతి పక్షాలు ఏకిపారేస్తున్నాయి.

రాష్ట్రంలోని హమీర్‌పూర్‌ లో రద్దీగా ఉన్న రోడ్డు పై తోపుడు బండి పై అనారోగ్యంతో ఉన్న మహిళకు దుప్పటి కప్పి తీసుకుని వెళ్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో పై యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌ వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ స్పందించారు. యోగీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు.

Also read: బిగ్ బాస్ ఇంట్లో ‘శ్రీమంతం’ వేడుకలు.. ఎమోషనల్ ప్రోమో..!

యోగీ ప్రభుత్వంలో ప్రజలు బండ్ల పై రోగులను తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. హమీర్‌ పూర్‌ లో అంబులెన్స్‌ రాకపోవడంతో కుటుంబ సభ్యులే రోగిని తోపుడు బండి పై ఆసుపత్రికి తీసుకుని వెళ్లారని ఇది చాలా సిగ్గుచేటు..ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ ఎంత గందరగోళంగా ఉందో ఈ వీడియోను చూస్తేనే అర్థం అవుతుంది అంటూ విమర్శించారు. దీనికి ముఖ్యమంత్రితో పాటు , ఆరోగ్య శాఖ మంత్రి కూడా బాధ్యత వహించాల్సిందేనని అఖిలేష్‌ ట్వీట్‌ చేశారు.

వచ్చే ఎన్నికల్లో దీనికి కచ్చితంగా ప్రజలు సమాధానం చెప్పి తీరుతారని యూపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు అవుతుంది. అంబులెన్స్ 108 కి ఎన్ని సార్లు ఫోన్‌ చేసినప్పటికీ కూడా అధికారులు ఎవరూ స్పందించలేదని రోగి తరుఫు బంధువులు ఆరోపిస్తున్నారు. అప్పటికే రోగి పరిస్థితి దిగజారిపోతుండడంతో తప్పని పరిస్థితుల్లో తోపుడు బండి పై ఆసుపత్రికి తీసుకుని వెళ్లామని రోగి కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదిలా ఉంటే ..ఈ వాదనను అధికారులు తోసిపుచ్చారు. అంబులెన్స్‌ నెంబర్‌ 108 అయితే రోగి తరుపు వారు 0108 కి కాల్‌ చేశారని అందుకే 108 సిబ్బందికి ఎటువంటి సమాచారం రాలేదని చెబుతున్నారు. వీడియో నెట్టింట్లో వైరల్‌ కావడంతో జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే ఈ ఘటన గురించి విచారణ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వైద్యాధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు