Mumbai Airport: అలా చేయకుంటే ముంబయి ఎయిర్‌పోర్టును పేల్చివేస్తానంటూ బెదిరించిన దుండగుడు..

ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును పేల్చేస్తానని ఓ దుండగుడు బెదిరించడం కలకలం రేపింది. తనకు రూ.10 లక్షల విలువైన బిట్‌కాయిన్స్‌ పంపకుంటే ఎయిర్‌పోర్టును పోల్చివేస్తానంటూ అతడు బెదిరించాడు. చివరికి ఐపీ అడ్రస్‌ ద్వారా మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ నిందితుడ్ని అదుపులోకి తీసుకుంది.

New Update
Mumbai Airport: అలా చేయకుంటే ముంబయి ఎయిర్‌పోర్టును పేల్చివేస్తానంటూ బెదిరించిన దుండగుడు..

ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానికి బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఓ వ్యక్తి ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానశ్రయాన్ని పేల్చేస్తానని బెదిరించడం కలకలం రేపింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబయి ఎయిర్‌పోర్టును నిర్వహిస్తున్న మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ (ATS) ఇన్‌బాక్స్‌కు గురువారం ఓ బెదిరింపు వచ్చింది. అందులో.. తాను చెప్పిన అడ్రస్‌కు రూ.10 లక్షల విలువైన బిట్‌కాయిన్స్‌ పంపకుంటే.. ఎయిర్‌పోర్టును పేల్చివేస్తామని ఇది ఫైనల్ వార్నింగ్ అంటూ ఆ నిందితుడు మెయిల్‌లో బెదిరించాడు.

Also read: జీతం అడిగిన దళితుడు.. బూట్లు నాకించిన యాజమాని.. బెల్టుతో చావకొట్టారు.. వీళ్లేం మనుషులు!

దీంతో వెంటనే అప్రమత్తమైన ఏటీఎస్‌ రంగంలోకి దిగింది. అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. సైబర్ సెల్ దర్యాప్తు చేపట్టింది. చివరికి ఐపీ అడ్రస్‌ ద్వారా అతడు కేరళలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఏటీఎస్‌ బృందం కేరళకు వెళ్లిన నిందితుడిని అరెస్టు చేసింది. ఆ తర్వాత ముంబయికి తీసుకొచ్చింది. అనంతరం సహార్‌ పోలీసులకు ఎటీఎస్ సిబ్బంది ఆ నిందుతుడ్ని అప్పగించారు. అయితే ప్రస్తతం నిందితుడిపై విచారణ చేస్తున్నామని.. ఇందుకు సంబంధించిన విషయాలను దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Also Read: ఛీ..ఛీ.. వీళ్లు తల్లిదండ్రులేనా.. డ్రగ్స్ కోసం బిడ్డల్ని అమ్ముకున్నారు..

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

Advertisment
తాజా కథనాలు