Delhi: పెళ్ళయిన 3నెలలకే.. హార్ట్ ఎటాక్‌తో చనిపోయిన భర్త.. ఏడో అంతస్తు నుంచి దూకిన భార్య

పెళ్ళయి మూడు నెలలే అయింది. అంతలోనే మృత్యువు వారిద్దరినీ కబళించింది. ఒకరోజు తేడాలో నవ దంపతులు ఇద్దరూ తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ షాకింగ్ ఘటన ఢిల్లీలోని ఘాజియాబాద్‌లో జరిగింది.

Delhi: పెళ్ళయిన 3నెలలకే.. హార్ట్ ఎటాక్‌తో చనిపోయిన భర్త.. ఏడో అంతస్తు నుంచి దూకిన భార్య
New Update

Ghaziabad Man Dies Of Heart Attack: ఢిల్లీ ఘాజియాబాద్‌లో ఉండే అభిషేక్ ఆహ్లూవాలియా, అంజలికి మూడు నెలల క్రితం నవంబర్‌లో పెళ్ళయింది. వీరి వయసు 25. పెళ్ళయిన తర్వాత వీరిద్దరూ చాలా ఆనందంగా జీవితాన్ని స్టార్ట్ చేశారు. తమ ప్రేమ ప్రపంచాన్ని ఎన్నో కలలతో నిర్మించుకున్నారు. కానీ అంతలోనే వారిని మృత్యువు వెంటాడింది. తీరని లోకాలకు చేర్చింది. మొదట అభిషేక్ చనిపోయాడు. అతనిని విడిచి ఉండలేక అంజలి కూడా అశువులు బాసింది.

ఏం జరిగిందంటే..

అభిషేక్, అంజలిలు వీకెండ్ మంచిగా ప్లాన్ చేసుకుని జూకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఎంతో సరదాగా వెళ్ళారు కూడా. కానీ అక్కడకు వెళ్ళాక జూలో తిరుగుతండగా అభిషేక్‌కు గుండెనొప్పి వచ్చింది. వెంటనే అంజలి అతనని ఫ్రెండ్స్ సహాయంతో ఆసుపత్రిలో జాయిన్ చేసింది. భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఎతంఓ ప్రయత్నించింది. కానీ అభిషేక్ ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అంజలి జీర్ణించుకోలేక పోయింది. తాను ఎంతో ప్రేమించి భర్త తన కళ్ళ ముందే చనిపోవడాన్ని తట్టుకోలేకపోయింది. దీంతో అభిషేక్ మరణించిన మరుసటి రోజూ తాను ప్రాణాలు తీసుకుంది. వారు ఉంటున్న బిల్డింగ్ ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. భవనం నుంచి దూకిన అంజలిని కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులు ఎంతో ప్రయత్నించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కానీ అంజలి ప్రాణాలను కాపాడుకోలేకపోయారు.

Also Read:Andhra Pradesh: ఉమ్మడి కర్నూలులో జాబ్‌ మేళా

ఎననో కలలతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టిన అభిషేక్, అంజలిలు చివరకు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఈ 25 ఏళ్ళ నవ దంపతుల మరణం అక్కడి వారందరినీ కదిలించి వేసింది. ఇంత చిన్న వయసులోనే అభిషేక్‌ హార్ట్ ఎటాక్‌తో మరణించడం తట్టుకోలని విషాదం అయితే అతని కోసం అంజలి ప్రాణాలు తీసుకోవడం మరింత విషాదాన్ని నింపింది. ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుఉతన్నారు. వారిని ఓదార్చడం ఎవ్వరి వల్లనా కావడం లేదు.

యువతలో ఎక్కువవుతున్న హార్ట్ ఎటాక్‌లు..

ఈమధ్య ఆకలంలో ఇలా యంగ్ పీపుల్ హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు పోగొట్టుకోవడం ఎక్కువైపోతోంది. జిమ్‌లలో, గర్భా డాన్స్ చేస్తున్నప్పుడు...ఇంకా చాలా సందర్భాల్లో అలసటకు గురయి తర్వాత హార్ట్‌ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి కారణం వారి ఆహారాపు అలవాట్లు, జీవన ప్రమాణాలే అంటున్నారు డాక్టర్లు. ఈ మరణాలు మరింత ఎక్కువ అవకుండా యువత తన జీవన పద్ధతిని మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఫిట్‌గా ఉండడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని చెబుతున్నారు.

#delhi #heart-attack #ghaziabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe