Mamata Benarjee: మా రాష్ట్రం పేరును అలా మార్చండి.. సీఎం మమతా బెనర్జీ డిమాండ్..

తమ రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారం చూస్తే.. జాబితాలో తమ రాష్ట్రం పేరు చివర్లో ఉందని తెలిపారు. దీనివల్ల సమావేశాలకు హాజరైన తమ ప్రతినిధులు చివరి వరకు ఆగాల్సి వస్తుందని తెలిపారు.

Mamata Banerjee: ఒంటిరిగానే పోటీ చేస్తాం.. ఇండియా కూటమికి దీదీ షాక్
New Update

Mamata Benarjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌గా (West Bengal) ఉన్న తమ రాష్ట్రాన్ని 'బంగ్లా'గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారం చూస్తే.. జాబితాలో తమ రాష్ట్రం పేరు చివర్లో ఉందని తెలిపారు. దీనివల్ల సమావేశాలకు హాజరైన తమ ప్రతినిధులు చివరి వరకు ఆగాల్సి వస్తుందని పేర్కొన్నారు. తమ రాష్ట్రం పేరును మార్చాలని మా అసెంబ్లీ గతంలోనే బిల్లుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇందుకు సంబంధించి కూడా మేము అన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చామన్నారు.

Also Read: 14వేల కోట్లకు మేఘా విడాకులు..పీపీరెడ్డిని బయటకు పంపేసిన కృష్ణారెడ్డి

అయినా కూడా మా రాష్ట్రం పేరు 'బంగ్లా'గా (Bangla) మారలేదు. గతంలో బాంబే పేరును ముంబయిగా మార్చారని.. అలాగే ఒరిస్సా పేరును కూడా ఒడిశాగా మార్చారని మమత అన్నారు. కానీ మా రాష్ట్రం పేరు మాత్రం ఎందుకు మారడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం పేరుమారితే తప్పేముందని.. పలు పోటీల్లో పాల్గొని, చదువుకోవడానికి వెళ్లాలనుకునే పిల్లలకు ప్రాధాన్యం దక్కుందని తెలిపారు. మా రాష్టం పేరు చివర్లో ఉండటం వల్ల ప్రతీ సమావేశంలో కూడా చివరి వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు.

మా రాష్ట్రం ( వెస్ట్‌ బెంగాల్‌) లో 'వెస్ట్' అని జత చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. గతంలో కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం పేరు మార్చాలనే డిమాండ్‌ వినిపించిందని తెలిపారు. 2011లో అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ రాష్ట్రం పేరును 'పశ్చిమ బంగ' గా పేరు మార్చాలని కోరిందని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనను తిరస్కరించినట్లు పేర్కొన్నారు.

Also read: మీ ఇంటికే అయోధ్యారాముడి మహాప్రసాదం..ఇలా స్వీకరించండి..!!

#national-news #mamata-banerjee #west-bengal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe