Kolkata: ఆదివారంలోగా నిందితుడిని ఉరిశిక్ష తీయాలి..దీదీ అల్టిమేటం

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన జూనియర్ డాక్టర్ హత్య కేసు విషయంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీబీఐకు అల్టిమేటం జారీ చేశారు. వచ్చే ఆదివారంలోగా నిందితుడికి ఉరిశిక్ష వేయాలని..బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు.

New Update
Budget 2024: ప్రజలను మోసగించిన బడ్జెట్‌- బెంగాల్ సిఎం మమత బెనర్జీ

Trainee Doctor Rape Case: కోలకత్తాలోని ట్రైనీ డాక్టర్ హత్య కేసు విషయాన్ని దీదీ సీరియస్‌గా తీసుకున్నారు. ఈకేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటూ ..పొలిటికల్‌గా కూడా దుమారం రేపుతోంది. ఈ హత్య విషయంలో బీజేపీ, సీపీఎంలో వైద్యురాలి ఘటనలో చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయంటూ మమతా విమర్శించారు. దాంతో పాటూ కేసును హ్యండోవర్ చేసుకున్న సీబీఐ అధికారులకు కూడా దీదీ అల్టిమేటం జారీ చేశారు. వచ్చే ఆదివారం లోగా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. లేకపోతే ఆగస్టు 16న కోల్‌కతాలోని మౌలాలి నుంచి ధర్మతాలా వరకు బాధితురాలికి మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని..సీబీఐ ఈ విషయంలో న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు కోలకత్తా పోలీసులకు హైకోర్టు చివాట్లు పెట్టింది.స్థానిక పోలీసులు, ఘటన జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఈ అత్యాచారం కేసును సీబీఐకు అప్పగించింది. ఇప్పటికే పోలీసులు సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే పోస్ట్ మార్టమ్‌లో బాధితురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని తేలడంతో..ఇందులో ఒకరు కంటే ఎక్కువ మందే పాల్గొన్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రైనీ డాక్టర్ ను సామూహిక అత్యాచారం చేశారని అంటున్నారు.

కోల్‌కత్తాలోని ఆర్జీ మెడికల్ కాలేజీలో ట్రైనీ పీజీ డాక్టర్‌గా పనిచేస్తున్న 31 ఏళ్ల యువతిపై దారుణంగా అత్యాచారం,హత్య జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న ఆమెను నిందితుడు పాశవికంగా అత్యాచారం చేశాడు. శుక్రవారం ఉదయం కాలేజీ సెమినార్ గదిలో బాధితురాలి మృతదేహం నగ్నంగా పడి ఉంది. ఆమె కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం కావడంతో పాటు పెదవులు, గొంతు, ముఖంపై గాయాలు ఉన్నట్లు తేలింది. మెడ ఎముక విరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.

Also Read:Andhra Pradesh: వల్లభనేని వంశీ ఎక్కడ?

Advertisment
Advertisment
తాజా కథనాలు