Mallu Ravi : రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా..! ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను రాజీనామా చేసినట్లు తెలిపారు. వారం రోజుల క్రితమే సీఎం రేవంత్ కు రాజీనామా లేఖను పంపినట్లు వివరించారు. By Bhoomi 23 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Mallu Ravi : ఢిల్లీ(Delhi) లో తెలంగాణ(Telangana) ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి(Mallu Ravi) రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పార్లమెంట్ ఎన్నికల్లోపోటీ చేసేందుకు తాను రాజీనామా చేసినట్లు తెలిపారు. శుక్రవారం జడ్జర్లలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వారం రోజుల క్రితం తన రాజీనామా లేఖను సీఎం రేవంత్ రెడ్డికి పంపించినట్లు వివరించారు. నాగర్ కర్నూల్ లోకసభ(Nagarkurnool Lok Sabha) నుంచి తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. గత జనవరి 28న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎంపీగా పోటీ చేస్తానని మొదట్నుంచీ తాను చెబుతున్న సంగతి తెలిసిందే. మరికొద్దిరోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా మల్లురవి తన పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీలో హాట్ టాపిగ్గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయసాయిరెడ్డి ఎంపీగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా జోడు పదవులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇది కూడా చదవండి : ఆ ఫేమస్ ఓటీటీలోనే అంబాజీ మ్యారేజీ బ్యాండు..స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? Your browser does not support the video tag. ఎంపీ టికెట్ పైనే ఆశలు.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) అదే జోష్ ను లోక్ సభ ఎన్నికల్లో కొనసాగించాలని చూస్తోంది. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. సర్వేలు ఆధారంగా గెలిచే గుర్రాలకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇదిలా ఉండగా ఎంపీ ఎన్నికల్లో(MP Elections) పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ హైకమాండ్ ఇస్తానని చెప్పిన తీసుకోకుండా లోక్ సభ సీట్ కోసమే కోటి ఆశలతో ఎదురు చూస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. నాగర్‌కర్నూలు ఎంపీ టికెట్ కోసం ఆయన హైకమాండ్ ను పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఆర్టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఇంట్రెస్ట్ లేదని.. ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క టికెట్.. ఇద్దరు పోటీ.. ఎంపీ ఎన్నికల్లో నాగర్‌కర్నూలు నుంచి పోటీ చేసి గెలిచి లోక్ సభలో తెలంగాణ గొంతు వినిపించాలని అని అనుకుంటున్నా మల్లు రవికి ఇప్పుడు ఆ సీటు తలనొప్పిగా మారింది. దీనికి ప్రధాన కారణం ఆయన పోటీ చేయాలనీ భావిస్తున్న అదే స్థానం నుంచి మరో బలమైన నేత పోటీ చేయాలనీ అనుకోవడమే. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సంపత్ ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట. అయితే.. తనకే నాగర్‌కర్నూలు ఎంపీ టికెట్ కావాలని లేదంటే పార్టీకి రాజీనామా చేస్తానని మల్లు రవి హైకమాండ్ కు తెలిపినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఢిల్లీలోని తన పదవికి రాజీనామా చేశారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మల్లు రవిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీరిద్దరిలో అధిష్టానం ఎవరికీ టికెట్ ఇస్తుందో చూడాలి మరి. #telangana #delhi #mallu-ravi #resigned మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి