/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-27T230454.990.jpg)
Malla Reddy Land Grab Issue : బీఆర్‌ఎస్ (BRS) మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) భూ కబ్జాలకు సంబంధించి ఆయన అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajasekhar Reddy) RTVతో సంచలన విషయాలు బయటపెట్టారు. భూమి కొన్న ఆధారాలు, సర్వే నెంబర్లతో సహా ఇంకేం చూపించారో తెలుసుకుందాం.
ఈ మేరకు బీఆర్‌ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్ సుచిత్ర పక్కనే ఉన్న కోట్ల విలువైన భూములను ఆక్రమించుకున్నాడని ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు మరికొందరు ఆరోపిస్తున్నారు. మామా, అల్లుడు కలిసి తమ భూమి కబ్జాచేసి వారి భూమిలో కలుపుకున్నారని వాపోతున్నారు. ఇటీవల వారంతా స్పాట్‌కు వెళ్లి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే సమాచారం అందుకున్న మల్లారెడ్డి తన మనుషులతో వెళ్లి వారిని అడ్డుకున్నారు. దీంతో ఈ స్థల వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇంతకు ఈ భూమి ఎవరిది? అసలైన పట్టాదారు ఎవరు? అనే విషయాలపై మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.. తెలుసుకునేందుకు ఈ వీడియో పూర్తిగా చూడండి.
Also Read : ఆయిల్ ట్యాంకర్, గ్యాస్ సిలిండర్ల లారీ ఢీ.. ఊపిరాడక అల్లాడుతున్న జనం!