Maldives: మాల్దీవుల అధ్యక్షుడి యూటర్న్‌‌–భారత్ తమకు ముఖ్యం అంటూ వ్యాఖ్యలు

మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఇంతకు ముందంతా అంటీ ముట్టనట్టుగా ఉన్న ఆయన ఇప్పుడు సడెన్‌గా..తమ సన్నిహిత దేశాల్లో భారత్ ఒకటి అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తమకు ముఖ్యభాగస్వామి అని కూడా అన్నారు.

Maldives: మాల్దీవుల అధ్యక్షుడి యూటర్న్‌‌–భారత్ తమకు ముఖ్యం అంటూ వ్యాఖ్యలు
New Update

Mohammad Muizzu:  భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రస్తుతం మాల్దీవుల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుని కలిశారు. ఈ సందర్భంగా వారు అనేక అంశాల మీద చర్చలు జరిపారు. తర్వాత మీడియాతో మంత్రి జైశంకర్ మాట్లాడుతూ తమ ప్రజలు, ఈ ప్రాంత ప్రయోజనాల కోసం భారత్‌-మాల్దీవుల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు.

మరోవైపు ఇదే విషయం మీద మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మాట్లాడుతూ...భారత మంత్రి జైశంకర్‌‌ను కలవడం ఆనందంగా ఉందని చెప్పారు. తమ సన్నిహిత దేశాల్లో భారత్ ఒకటని అన్నారు. ఆర్ధికంగా భారత్‌ తమ దేశానికి ముఖ్యభాగస్వామి అని చెప్పారు. తమ దేశం అవసరంలో ఉన్నప్పుడల్లా సాయం చేయడంతో భారత్‌ ముందు ఉంటుందని చెప్పుకొచ్చారు. భారత్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ముయిజ్జు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు అంటీముట్టనట్టుగా ఉన్న మాల్దీవుల దేశాధ్యక్షుడు ఒక్కసారిగా ఇలా యూటర్న్‌ తీసుకోవడం..రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

ప్రధాని మోదీ లక్షదీవులను పర్యటించి, వాటిని ప్రమోట్ చేశాక..మాల్దీవులకు, భారత్‌కు మధ్య మాటల యుద్ధం నడిచింది. మాల్దీవులకు చెందిన మంత్రులు భారతదేశం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. మయిజ్జు రెండోసారి మాల్దీవులకు అధ్యక్షుడు అయిన తర్వాత కూడా అంటీముట్టనట్లుగానే ఉన్నారు. అయితే భారత్‌తో గొడవ జరిగిన తర్వాత మల్దీవుల ఆర్ధిక పరిస్థితి బాగా దెబ్బతింది. మాల్దీవుల పర్యాటక రంగంపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అందుకే ఇప్పుడు ముయిజ్జు ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు.

#india #maldives #mohammad-muizzu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe